టీడీపీకి షాక్…కాంగ్రెస్‌లోకి కీలక నేత..!!

Share Icons:

హైదరాబాద్, 22 ఫిబ్రవరి:

తెలంగాణలో కాంగ్రెస్‌కి అన్నీ కలిసొస్తున్నాయి. క్రమంగా ఆ పార్టీ తన బలం పెంచుకుంటుంది. గతంతో పోల్చుకుంటే టిఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గినట్లు కనిపిస్తుంది.. అలాగే తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టడంతో ఆ పార్టీకి మంచి పట్టు వచ్చింది..అలాగే టీడీపీ నుంచి మరో కీలక నేత బయటకు రాబోతున్నారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డి వచ్చే నెలలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.

vanteru prathap reddy to join in congress

గత ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పై పోటీ చేసి, గట్టి పోటీ ఇచ్చారు. అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నర్సారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయారు. అనంతరం ఆయనకు రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో గట్టి నాయకుడి కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్ పార్టీ వంటేరుపై దృష్టి సారించింది.

టీఆర్ఎస్ పై గట్టిగా పోరాటం చేసిన వంటేరు… గత కొన్ని రోజుల నుంచి టీడీపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. ఎన్టీఆర్ భవన్‌కు కూడా దూరంగా ఉంటున్నారు. మరోవైపు, చంద్రబాబుతో కూడా చర్చించిన తర్వాతే ఆయన తుది నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. వివిధ అంశాలపై ఆయన గ్రామాల వారీగా కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటున్నట్లు సమాచారం.

మామాట: ఇలా అయితే తెలంగాణలో టీడీపీ కనుమరుగే…

English Summary: one more senior leader from Telangana TDP likely to join Telangana Congress. According to the reports TDP leader Vanteru Pratap Reddy, who had contested unsuccessfully against the Chief Minister KCR in the last General Elections, are likely to join the Congress next month.

Leave a Reply