సీజేకీ సారీ చెప్పిన తమిళనాడు గవర్నర్

T.N. Governor calls up Madras High Court Chief Justice, regrets protocol gaffe
Share Icons:

చెన్నై, ఆగష్టు 16,

గత ఆదివారం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణం చేసిన న్యాయమూర్తి విజయకమలేశ్ తిలర్మతికి తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ క్షమాపణలు చెప్పారన్న విషయం మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకూ జరిగిందేమిటంటే… గత ఆదివారం మద్రాసు సీజే ప్రమాణశ్వీకారోత్సవం రాజ్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు ముందు వరుసలో సీట్ల కేటాయించిన రాజ్ భవన్ సిబ్బంది, వారికి వెనుక వరుసలో హైకోర్టు న్యాయమూర్తులకు సీట్లు ఏర్పాటు చేశారు. దీనితో పలువురు న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఇది  ఇలా ఉండగా నిన్న బుధవారం ఆగష్టు 15 వేడుకల అనంతరం సాయంత్రం గవర్నర్ అట్ హోమ్ పేరుతో నగర ప్రముఖులకు విందు ఇవ్వడం సంప్రదాయం. దీనికి వివిధ వర్గాల ప్రముఖులు హాజరవుతారు. ప్రొటోకాల్ వివాదం కారణంగా హైకోర్టు న్యాయమూర్తులు ఈ విందును బహిష్కరించనున్నారన్న సమాచారం తెలుసుకున్న గవర్నర్ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఇదే విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి హైకోర్టులో పతాకావిష్కరణ తరువాత న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించినపుడు వెల్లడించారు. గవర్నర్ స్వయంగా తనకు ఫోన్ చేసి జరిగిన విషయంపై విచారం వ్యక్తం చేశారని, స్వతంత్ర్యదినోత్సవ విందుకు రావలసిందిగా న్యాయమూర్తులను ఆహ్వానాలు పంపారని తెలిపారు. ఈ నేపథ్యంలో తాను వెళ్లకపోతే సమస్య జఠిలంగా మారుతుందని సహ న్యాయమూర్తలకు వివరించారు. అనంతరం పలువురు హైకోర్టు న్యాయమూర్తులు మనసు మార్చుకుని నిన్న సాయంత్రం రాజ్ భవన్లో జరిగిన అట్ హోం కార్యక్రమంలో  సిజే విజయకమలేశ్ తిలర్మతి సహా  పాల్గొన్నారు. అయితే న్యాయమూర్తి ఎం ఎస్ రమేశ్ మాత్రం రాజ్ భన్ సిబ్బంది తీరుపై అధికారికంగానే అసహనం వ్యక్తం చేశారని, ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణ శ్వీకార ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను అడ్డుకున్న పోలీసు అదికారులపై చర్యలకు పట్టుబట్టినట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా గత ఆదివారం రాజ్ భవన్లో చోటు చేసుకున్న అంశాలు విచారకరమనీ, బాధ్యులను శిక్షించాలని కోరుతూ మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం ఓ తీర్మాణం ఆమోదించింది.

మామాట: రాజ్యాంగ సంస్థలు కూడా  వివాదాలు కెలుకుతాయా…

Leave a Reply