చిరంజీవి పుట్టినరోజు కానుకగా సైరా ట్రైలర్ విడుదల?

Share Icons:

 

హైదరాబాద్, 15జూన్:

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం `సైరా`. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప‌లు భాష‌ల‌కు చెందిన ప్ర‌ముఖ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. త్వ‌ర‌లో ఈ సినిమా ట్రైల‌ర్ కూడా విడుద‌ల కాబోతోంద‌ట‌. మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 22వ తేదీన `సైరా` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌ల‌నుకుంటున్నార‌ట‌. ఇక దస‌రా సంద‌ర్భంగా ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, హిందీ, తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. అమితాబ్, విజయ్ సేతుపతి లాంటి వారిని ఇందులో ప్రధాన పాత్రలకు ఎంపిక చేయడానికి కారణం దీన్ని కేవలం రీజనల్ మూవీలా కాకుండా ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించడమే.

అయితే ఈ సినిమాకు రామ్ చరణ్ చెబుతున్న రేట్లు చూసి డిస్ట్రిబ్యూటర్లు బెంబేలెత్తిపోతున్నారట. హిస్టారికల్ మూవీ, పైగా భారీగా బడ్జెట్ ఖర్చు పెట్టారు. మరి పెట్టిన పెట్టుబడి రికవరీ కావాలంటే సినిమాను సాధారణ రేట్ల కంటే కాస్త ఎక్కువగా అమ్మాల్సిన పరస్థితి.

కేవలం తెలుగు వెర్షన్ నుంచే ఈ సినిమాకు రామ్ చరణ్ రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారట. ఇతర భాషలన్నింటిలో కలిపి మరో రూ. 80 కోట్లు ఆశిస్తున్నారట. దీని ద్వారా సినిమా పెట్టబడి రికవరీ అవుతుందని అంచనా. రామ్ చరణ్ చెబుతున్న రేటు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ… సినిమా బడ్జెట్ దృష్ట్యా అది న్యాయమైన రేటే అనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది

Leave a Reply