మరోసారి బిగ్‌బాస్ నుండి ఔట్ అయిన శ్యామల…

Share Icons:

హైదరాబాద్, 10 సెప్టెంబర్:

ఇప్పటికే 92 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 మరింత ఆసక్తిగా మారింది. నిన్న జరిగిన షోలో ‘సిల్లీ ఫెలోస్’ సినిమా హీరోలు సునీల్, అల్లరి నరేశ్ హౌస్‌లోకి వచ్చి హౌస్‌మేట్స్‌తో కొంత సమయం గడిపారు. వారు ఉన్నంతసేపు షో చాలా ఎంటర్టైనింగ్‌గా సాగింది. వారితో కూడా నాని ఓ గేమ్ ఆడించి తనదైన హోస్టింగ్ స్కిల్స్ తో మెప్పించాడు.

ఇక ఎలిమినేషన్ సమయానికి  వచ్చేసరికి ముందుగా దీప్తి నల్లమోతు సేవ్ అయినట్లు ప్రకటించిన నాని.. ఆ తరువాత కౌశల్ కూడా సేఫ్ జోన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ఇక ఎలిమినేషన్‌లో మిగిలిన శ్యామల, అమిత్ పేర్లలో అమిత్ సేవ్ అయినట్లు చెప్పడంతో ఫైనల్‌గా శ్యామల ఎలిమినేట్ అయినట్లు వెల్లడించారు.

ఇదివరకే ఎలిమినేషన్‌ని ఫేస్ చేసిన శ్యామల ఈసారి మాత్రం పెద్దగా ఎమోషనల్ అవ్వలేదు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన శ్యామలని హౌస్ మేట్స్ ఒక్కొక్కరిపై ఒపీనియన్స్ అడిగి తెలుసుకున్న నాని… ఈ షోలో టాప్ త్రీలో ఎవరుంటారని ప్రశ్నించగా దానికి శ్యామల.. గీతామాధురి, తనీష్, రోల్ రైడాల పేర్లు చెప్పింది.

మామాట: మరి ఈ సీజన్ బిగ్‌బాస్ గెలిచేదెవరో?

Leave a Reply