TRENDING NOW

స్వామి ప్లస్సా..మైనస్సా… బీజేపీ నేతల్లో అంతర్మధనం

స్వామి ప్లస్సా..మైనస్సా…  బీజేపీ నేతల్లో అంతర్మధనం
views:
3

తెలంగాణ, డిసెంబర్ 3,

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. తమ తమ పార్టీల గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఎవరికివారు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్, పలు పార్టీల సమూహం ప్రజాకూటమి, బీజీపీ పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అయితే ఇలాంటి ఈ ముఖ్యమైన తరుణంలో పరిపూర్ణానంద స్వామి పరిపక్వం లేకుండా మాట్లాడుతున్నారని, అవి బీజేపీ శ్రేణులకు లేని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని చెప్పుకుంటున్నారు కమలం పార్టీ నేతలు.

స్వామి పరిపూర్ణానంద వల్ల పార్టీ పట్ల ప్రజల్లో చులకన భావం కలుగుతోందని, ఆయనతో వేగలేకపోతున్నామని టీబీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా అనేస్తున్నారు. అంతేకాదు ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న ఉన్న తమను లెక్క చేయకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవలే అనూహ్యంగా బీజేపీలో చేరిన పరిపూర్ణానందను ఆ పార్టీ నేతలు పెద్దగా సపోర్ట్ చేయటం లేదు. ఆయన రాకతో పార్టీకి ఒరిగిందేమీ లేదని అంటున్నారు. పరిపూర్ణానంద చేరే సమయంలో కూడా ఆయన వెంట ఎవరూ లేరు. అయినా కూడా ఆయనే సీఎం అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతానికైతే పరిపూర్ణానంద ఎక్కడా పోటీ చేయడం లేదు. కానీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.

అయితే ఈ ప్రచారాల్లో అయన మాట్లాడుతున్న మాటలు బీజీపీ పరువును గంగలో కలుపుతున్నాయని అంటున్నారు కొందరు.తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి 70 స్థానాలు వస్తాయని, రాష్ట్రంలో ఒకేసారి కింగ్ మేకర్ అవుతామని చెబుతూ.. తెలంగాణలో పార్టీ బలాబలాలపై ఏ మాత్రం అవగాహన లేకుండా విరుద్ధ ప్రకటనలు చేయటం పార్టీ పరువు తీయటమేనని స్వయంగా ఆ పార్టీ నేతలే అంటుండటం గమనార్హం. ఆయన వ్యవహారం ఇలా ఉంటే.. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా ఇక్కడి సీనియర్ నేతలను పక్కనపెట్టి కేవలం పరిపూర్ణానంద తోనే భేటీ అవడంపై టీబీజేపీ నేతలు రగిలిపోతున్నారట. దీంతో.. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల ఫలితాల అనంతరం టీబీజేపీలో ఆదోళనకర పరిస్థితులు కనిపిస్తాయేమో! అనే కోణంలో సందేహాలు మొదలయ్యాయి జనాల్లో. టీబీజేపీ నేతలకు ఇదిపెద్ద సమస్యే కదా.

 

మామాట: స్వాములోరి అనుగ్రహమే ఆగ్రహమా… 

(Visited 1,073 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: