టాటాకేన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన

Share Icons:

తిరుపతి, ఆగస్టు 31,

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా లు శుక్రవారం భూమి పూజ చేశారు. అలిపిరి-శ్రీనివాస మంగాపురం మార్గంలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల (జూ) సమీపంలో ఈ వైద్యశాలను టాటా ట్రస్ట్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకుగాను తితిదే కేటాయించిన 25 ఎకరాల స్థలంలో రూ.1000 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. మొత్తం వెయ్యి పడకలకు గానూ తొలి దశలో 376 పడకలతో ఆస్పత్రి ప్రారంభమౌతుంది, తరువాత దానిని విస్తరిస్తారు. ఈ ఆస్పత్రి ద్వారా రోగులకు క్యాన్సర్‌ చికిత్సతో పాటు దేశంలోని టాటా క్యాన్సర్‌ చికిత్స కేంద్రాల పరిధిలో పరిశోధనలు చేపడతారు. కార్యక్రమానికి పలువురు మంత్రులు, తెదేపా నాయకులు, తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో అనిల్‌ సింఘాల్‌, జిల్లా కలెక్టర్, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, తిరుపతి శాసనసభ్యురాలు సుగుణ తదితరులు హాజరయ్యారు.

మామాట: కేన్సర్ మహమ్మారికిక టా టా నే

Leave a Reply