అందుబాటు ధరలో విడుదలైన సుజుకీ కొత్త యాక్సెస్‌ 125…..

suzuki released new access 125 scooter in india
Share Icons:

ఢిల్లీ:

 

మధ్యతరగతి వినియోగదారులని దృష్టిలో పెట్టుకుని సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్‌) స్కూటర్‌ మోడల్‌ అప్ డేటెడ్ యాక్సెస్‌ 125 స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.61,788 గా నిర్ణయించారు.

 

అయితే భారత్‌లో సుజుకీ విజయానికి యాక్సెస్‌ 125 చాలా కీలక పాత్ర పోషించింది. దీంతో వినియోగదారులకు మరింత నచ్చేలా కొన్ని మార్పులు చేసి నవీకరించిన మోడల్‌ను తీసుకొచ్చాం’ అని ఎస్‌ఎంఐపీఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దేవాశిష్‌ హండా పేర్కొన్నారు.

 

యాక్సెస్ 125 సుజుకి స్కూటర్‌లో డిస్క్ బ్రేక్ ఎక్విప్డ్ మెటీరియల్ ఉన్నాయి. స్టాండ్డర్డ్ స్కూటర్ తో పోలిస్తే దీని ధర రూ.1600 ఎక్కువ. 124 సీసీ, ఫోర్ స్ట్రోక్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ కలిగిన కొత్త యాక్సెస్‌ 125 మంచి మైలేజీ, పనితీరు అందిస్తుంది.

 

ఈ కొత్త వెర్షన్‌ స్కూటర్‌లో బ్లాక్‌ అల్లాయ్‌ చక్రాలు, లేత గోధుమ రంగు లెదర్‌ సీట్, క్రోమ్‌ మిర్రర్స్‌ తదితర ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.  ప్రయాణ సమయంలో మొబైల్‌ ఫోన్లను ఛార్జింగ్‌కు వీలుగా డీసీ సాకెట్‌ను అమర్చారు. సుజుకి యాక్సెస్ 125 మోడల్ స్కూటర్ న్యూ మెటాలిక్, మాటి బ్రాడెక్స్, మెటాలిక్ మాటె బ్లాక్, మెటాలిక్ సోనిక్ సిల్వర్ రంగుల్లో లబిస్తుంది. బ్లాక్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ మిర్రర్స్, డీసీ సాకెట్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. లాంగ్ సీట్, వైడ్ ఫుట్ బోర్డు, జెనిరియస్ స్టోరేజీ వసతులు కూడా ఉన్నాయి.

Leave a Reply