యువతని ఆకర్షించే గిక్సర్ ఎస్‌ఎఫ్ 250

Share Icons:

ముంబై, 20 మే:

ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీదారు గిక్సర్ ఎస్ఎఫ్ 250 మంచి ఆఫర్లతో మార్కెట్లోకి  వస్తోంది. 2019 సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 ఏబీఎస్ ప్రత్యర్థి సంస్థలు హోండా సీబీఆర్ 250 ఆర్, యమహా ఫాజర్ 25 మోటారు సైకిళ్లతో పోటీ పడనున్నది. సుజుకి గిక్సర్  ఎస్ఎఫ్ 250 మోడల్ బైక్ ధర రూ.1.70-రూ.1.75 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 బైక్ పూర్తి ప్యాకేజ్డ్ ఆఫరింగ్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, స్ప్లిట్ సీట్స్, డుబుల్ బారెల్ ఎగ్జాస్ట్, 17 అంగుళాల డబుల్ స్పోక్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

ఆయిల్ కూల్డ్ ఇంజిన్, పీక్ టార్చ్ ఆఫ్ 22.6 ఎన్ఎం, 26 బీహెచ్పీ సామర్థ్యం గల శక్తిని విడుదల చేస్తుంది. 6 -స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. రేర్ డ్యూయల్ చానెల్ ఏబీఎస్, డిస్క్ బ్రేక్స్ హ్యాండ్లింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

మామాట: యూత్‌ని ఏ మేర ఆకర్షిస్తుందో చూడాలి

Leave a Reply