తెరపైకి ఏబీ తనయుడు…జగన్ ప్రభుత్వానికి వార్నింగ్…       

Share Icons:

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ఇంటెలిజన్స్ చీఫ్ ఏవీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీ డీజీపీగా పనిచేసినప్పుడు ఆయన నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ నివేదిక సమర్పించారు. ఆ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. సస్పెన్షన్‌లో ఉన్న కాలంలో ఆయన ప్రభుత్వ అనుమతి లేనిదే విజయవాడలోని హెడ్ క్వార్టర్స్‌ను వీడి వెళ్లరాదని పేర్కొంది. మునుపటి టీడీపీ ప్రభుత్వ హయాం‌లో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజన్స్ చీఫ్‌గా వ్యవహరించారు. వైసీపీ ఫిర్యాదు మేరకు గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

ఇప్పటికే ఈ వ్యవహారంపై ఏపీ వెంకటేశ్వర్రావు కూడా స్పందించారు.బంధుమిత్రులను ఉద్దేశించి వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. అక్రమాల కారణంగా నాపై చర్య తీసుకున్నారనేది అవాస్తవమన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సస్పెన్షన్ పై చట్ట పరంగా ముందుకు వెళ్తాన్నారు. ఆ తర్వాత ఏంటి అనేది క్రమంగా అందరికీ తెలుస్తుందన్నారు.దీనిపై ఆయన ఓ లేఖ కూడా విడుదల చేశారు.

దీనిపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు. అధికారిని అలా సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై ఏపీ వెంకటేశ్వర్రావు కుమారుడు చేతన్ సాయికృష్ణ సైతం స్పందించారు. తనపై వస్తోన్న ఆరోపణలను ప్రకటన ద్వారా ఆయన ఖండించారు. ఏపీ ప్రబుత్వానికి సంబంధించి తాను ఎలాంటి టెండర్లలోను పాల్గొనలేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభియోగాలతో తనకు ఏ విధమైన సంబంధము లేదన్నారు. తాను చేసింది ప్రైవేట్ స్టార్ట్ అప్ లు తప్ప ఏ ప్రభుత్వానికి సంబంధించిన టెండర్ల లో పాల్గొన లేదన్నారు. తన తండ్రి బాధ్యత కల్గిన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆయనకు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి తాను ఈ ప్రకటన విడుదల చేస్తున్నానని సాయికృష్ణ పేర్కొన్నారు. ఇకనైనా తమపై చేస్తున్న విష ప్రయోగాలు ఆపాలన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే పరువునష్టం నష్టం దావా వేయడం తప్ప తనకు వేరే మార్గాలు లేవన్నారు.

 

Leave a Reply