TRENDING NOW

పెళ్లి హడావుడిలో సుస్మితాసేన్

పెళ్లి హడావుడిలో సుస్మితాసేన్

కొల్ కతా, నవంబర్ 08,

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ పెళ్లిచేసుకుంటోందన్నవార్తలు నిజమేనట.  ఈ విశ్వసుందరి లేటుగా 42 ఏళ్ల  వయసులో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యిందంటూ బాలీవుడ్‌లో ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD
Life Homepathy

బాయ్ ఫ్రెండ్, మోడల్ కూడా అయిన రోహ్మాన్ షాల్‌తో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ఈ అందాల సుందరి అతడితోనే  మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్దమయ్యిందట. రోహ్మాన్ షాల్‌ పెళ్లి ప్రపోజ్ తేవడంతో ప్రియుడి కోరికను కాదనలేకపోయిందట సుస్మిత.  ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోకుండా ఉన్నసుస్మితా సేన్.. రీనా సేన్, అలిషా సేన్ అనే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. కాగా  దీపావళి రోజున సుస్మితా సేన్ తన ఇద్దరు పిల్లలు, కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోలతో ఇన్ట్సాగ్రామ్ లో హడావుడు చేయడంతో ఈ పెళ్లి వార్తను తనే  ప్రకటించినట్టే అయ్యిందని పరిశ్రమవర్గాలు గుసగుసలాడుతున్నాయి.

మామాట:  ఆలస్యం అంటే…. మరీ ఆలస్యం కాదులే బాసూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: