వైల్డ్ కార్డ్ ఎంట్రీతో  అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్

surpraise wild card entry in big boss house
Share Icons:

హైదరాబాద్:

బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ లో అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. గత ఆరు వారాలకు భిన్నంగా ఏడో వారంలో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ సాగింది. మొదట వినాయక చవితి సందర్భంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పువ్వులు, పండ్లు, స్వీట్స్ పంపారు. అనంతరం ఇంటి అందంగా ముస్తాబై పండుగ ఘనంగా జరిపారు. దీని తర్వాత ఇంటి సభ్యులందరూ ఒకరి తరవాత ఒకరు గార్డెన్ ఏరియాలో ఉన్న ఒప్పో జోన్‌లోని కెమెరా ముందుకొచ్చి ఒక అగరబత్తిని వెలిగించి మీ కోరికను వినాయకుడికి తెలియజేయాల్సి ఉంటుందని  ఇంటి సభ్యులకు చెప్పాడు.

దీంతో ఒకరి తర్వాత ఒకరు వచ్చి వినాయకుడి దగ్గర కోరికలు చెప్పారు. కొందరు పైకి గట్టిగా కోరికలు చెప్పగా, కొందరు లోపల చెప్పారు. బాబా భాస్కర్ అయితే తమిళంలో కోరుకున్నారు. ఈ కోరికల కార్యక్రమం అయ్యాక బిగ్ బాస్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగా అలీ-రవిలని మొదట కన్ఫెషన్ రూములోకి పిలిచారు. కాకపోతే ఎప్పటిలా వారితో బిగ్ బాస్ మాట్లాడలేదు. వాళ్ళ ఎదురుగా ఉన్న టీవీలో నల్లని చీకటిలో ఓ లేడీ వారితో మాట్లాడింది. అయితే ఆమెని గుర్తు పట్టలేకపోయారు.

ఇక ఆమె ఓ మిస్టరీ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. అలాగే వారితో కాసేపు మాట్లాడి ఎలిమినేషన్ చేయాలనుకుంటున్న ఇద్దరి పేర్లని చెప్పాలని కోరింది. దీంతో అలీ రాహుల్ పేరుగా చెప్పగా, రవి మహేశ్ పేరు చెప్పాడు. వీరి తర్వాత శివజ్యోతి-హిమజలు వచ్చారు. ఇక జ్యోతి మహేశ్ ని, హిమజ రాహుల్ పేరుని చెప్పింది. ఇలా తర్వాత వచ్చిన పునర్నవి రవిని, వితిక అలీని నామినేట్ చేసింది. ఇక రాహుల్ శ్రీముఖిని, మహేశ్ అలీని నామినేట్ చేశారు. అలాగే బాబా భాస్కర్ అలీని, శ్రీముఖి రాహుల్ ని నామినేట్ చేశారు. వీరి తర్వాత కెప్టెన్ వరుణ్ ఒక్కడే వచ్చి రవి, అలీ పేర్లని నామినేట్ చేశాడు.

ఈ ప్రక్రియ అయ్యాక ఆ మిస్టరీ ఫ్రెండ్ నిదానంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంతకీ ఆ మిస్టరీ ఫ్రెండ్ ఎవరో కాదు ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తాను షోలోకి వచ్చినట్టు అందరికీ శిల్పా చెప్పింది. ఇక ఇంటిలోకి శిల్పా అడుగు పెట్టిన వెంటనే బిగ్ బాస్ ఇరికించేశాడు. ఈవారం ఎలిమినేషన్‌కు శిల్పా ఇద్దరిని నామినేట్ చేయాలని సూచించారు. దానికి, సరైన కారణాలు కూడా చెప్పాలన్నారు. శిల్పా.. అలీ, శ్రీముఖిని నామినేట్ చేసింది. బలమైన కారణాలు ఏమీ లేవు కానీ.. అలీ ఒక్కసారి కూడా నామినేట్ కాలేదని, శ్రీముఖి స్ట్రాంగ్ కంటిస్టెంట్ కాబట్టి వీళ్లిద్దరినీ నామినేట్ చేస్తున్నానని చెప్పింది. దీంతో ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి రాహుల్, అలీ, మహేష్, రవి, శ్రీముఖి నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు.

Leave a Reply