అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్

Surface Laptop 3 is Microsoft's most powerful laptop yet, and it charges fast, too
Share Icons:

ముంబై: ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్.. సర్ఫేస్ సిరీస్‌లో రెండు నూతన ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. సర్ఫేస్ ల్యాప్‌టాప్ 3 మోడల్‌లో 13.5, 15 ఇంచ్ డిస్‌ప్లే సైజ్ వేరియెంట్లలో ఈ ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యాయి. 13.5 ఇంచుల మోడల్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ 3 ధర దాదాపుగా రూ.71,140 ఉండగా, 15 ఇంచుల ల్యాప్‌టాప్ ధర దాదాపుగా రూ.85,350గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పలు ఎంపిక చేసిన దేశాల‌ మార్కెట్లలో గురువారం నుంచి ఈ ల్యాప్‌టాప్‌లను విక్రయిస్తున్నారు.

13.5 ఇంచుల సర్ఫేస్ ల్యాప్‌టాప్‌ ఫీచర్లు

ఇంటెల్ కోర్ ఐ5/ఐ7 10వ జనరేషన్ ప్రాసెసర్, ఇంటెల్ ఐరిస్ ప్లస్ గ్రాఫిక్స్ 950, 8/16 జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128/256/512జీబీ/1టీబీ ఎస్‌ఎస్‌డీ. విండోస్ 10, 720పి హెచ్‌డీ వెబ్ కెమెరా, డాల్బీ ఆడియో, విండోస్ హలో ఫేస్ సైనిన్, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 11.5 గంటల బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ చార్జింగ్.

15 ఇంచుల సర్ఫేస్ ల్యాప్‌టాప్

ఏఎండీ రైజెన్ 5 3580యు/రైజెన్ 7 3780యు మొబైల్ ప్రాసెసర్, రేడియాన్ వెగా 9 గ్రాఫిక్స్/రేడియాన్ ఆర్‌ఎక్స్ వెగా 11 గ్రాఫిక్స్, 8/16/32 జీబీ డీడీఆర్4 ర్యామ్, 128/256/512 జీబీ ఎస్‌ఎస్‌డీ. విండోస్ 10, 720పి హెచ్‌డీ వెబ్ కెమెరా, డాల్బీ ఆడియో, విండోస్ హలో ఫేస్ సైనిన్, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 11.5 గంటల బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ చార్జింగ్ .

 

సర్ఫేస్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

అలాగే మైక్రోసాఫ్ట్.. సర్ఫేస్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. కేవలం గ్లేసియర్ కలర్ ఆప్షన్‌లోనే విడుదలైన ఈ ఇయర్‌బడ్స్ 249 డాలర్ల (దాదాపుగా రూ.17,730) ధరకు వినియోగదారులకు త్వరలో లభ్యం కానున్నాయి. వీటిల్లో 13.6 ఎంఎం డ్రైవర్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల వీటి నుంచి వచ్చే సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. కాల్స్, మ్యూజిక్ కోసం వీటికి ప్రత్యేకంగా కంట్రోల్స్‌ను అందిస్తున్నారు.

ఒకసారి వీటికి ఫుల్ చార్జింగ్ పెడితే 24 గంటల వరకు నాన్‌స్టాప్‌గా పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 4.4 ఆపైన వెర్షన్, ఐఓఎస్ 9 ఆపైన వెర్షన్, విండోస్ 10 డివైస్‌లకు ఈ ఇయర్ బడ్స్ బ్లూటూత్ 4.1 లేదా 4.2 ద్వారా కనెక్ట్ అవుతాయి. మైక్రోసాఫ్ట్ డిజిటల్ అసిస్టెంట్ కార్టానా 3కి వీటిలో సపోర్ట్‌ను అందిస్తున్నారు. యూఎస్‌బీ టైప్ సి చార్జింగ్ పోర్ట్‌ను ఇచ్చినందున ఈ ఇయర్‌బడ్స్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.

 

Leave a Reply