నంద్యాల మళ్ళీ వైసీపీదే…!

Share Icons:

కర్నూలు, 20 మే:

ఫలితాలు మరో రెండు రోజుల్లో వెలువడనున్నాయి. అయితే నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఇందులో కొన్ని సర్వేలు ఏపీలో టీడీపీ గెలుస్తుందని చెబితే…మరికొన్ని వైసీపీదే అధికారం అని చెప్పాయి.

ఈ క్రమంలోనే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్‌లో నంద్యాల లోక్ స‌భ ని వైసీపీనే కైవసం చేసుకుంటుందని తెలినట్లు సమాచారం. గత ఎన్నికల్లో నంద్యాల పార్ల‌మెంటు ప‌రిధిలో వైసీపీ బ‌లంగా ఉండ‌టంతో ఎస్పీవై రెడ్డి సులువుగా విజ‌యం సాధించారు. అయితే, ఆ తరవాత ఆయన టీడీపీలో చేరారు.

దీంతో ఈసారి వైసీపీ నుంచి పోచ బ్ర‌హ్మానంద‌రెడ్డి పోటీ చేయగా…. చంద్ర‌బాబు నాయుడు మాత్రం ఎస్పీవై రెడ్డిని ప‌క్క‌న‌పెట్టి నందికొట్కూరు అసెంబ్లీ ఇంఛార్జిగా ఉన్న మాండ్ర శివానంద‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. దీంతో ఎస్పీవై రెడ్డి జ‌న‌సేన పార్టీలో చేరి ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేశారు.

జనసేన పోటీలో ఉన్న ప్రధాన పోరు టీడీపీ-వైసీపీల మధ్యే ఉంది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆళ్ల‌గ‌డ్డ, నంద్యాల‌, శ్రీశైలం ఎమ్మెల్యేలు టీడీపీలో చేర‌డంతో ఈసారి త‌మ‌కు నంద్యాల లోక్ స‌భ ప‌రిధిలో బ‌లం పెరిగింద‌ని టీడీపీ అంచ‌నా వేస్తోంది.

అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన శిల్పా, గంగుల కుటుంబాలు, చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి, బిజ్జం పార్థ‌సార‌థి రెడ్డి వంటి నేత‌లు వైసీపీలో చేర‌డంతో త‌మ బ‌లం త‌గ్గ‌లేద‌ని, మ‌రింత పెరిగింద‌ని వైసీపీ ధీమాగా ఉంది. ముస్లింలు, రెడ్లు, బీసీలు నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో ఉన్నారు.

రెడ్లు, ముస్లింలలో వైసీపీ వైపు మొగ్గు ఉంటుంద‌ని, బీసీల్లో టీడీపీకి ఆధిక్య‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నాలు ఉన్నాయి. ఎస్సీల్లో వైసీపీకే మొగ్గు ఉంటుంది. అయితే, ఇటీవలే మరణించిన ఎస్పీవై రెడ్డి ఎవ‌రి ఓట్లు చీల్చాడ‌నే అంశం గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంది. మొత్తంగా నంద్యాల‌లో మ‌రోసారి వైసీపీకే విజ‌యావ‌కాశాలు ఉన్నట్లు క‌నిపిస్తోంది.

మామాట: చూద్దాం ఇంకా రెండు రోజులేగా

Leave a Reply