“న్యాయమూర్తులు చక్రవర్తుల్లా వ్యవహరించడం సరికాదు” -సుప్రీంకోర్టు!

Share Icons:
  • అధికారులను అనవసరంగా కోర్టుకు పిలవొద్దు..
  • చీటికిమాటికి అధికారులను పిలిస్తే కోర్టు గౌరవం పెరగదు…

న్యాయమూర్తులు ‘చక్రవర్తుల్లా’ ప్రవర్తించడం, చీటికిమాటికి ప్రభుత్వాధికారులను కోర్టుకు పిలవడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పద్ధతికి స్వస్తి పలకాలని సూచించింది. అధికారులను అనవసరంగా కోర్టుకు పిలుస్తూ న్యాయవ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ అధికారాల మధ్య విభజన రేఖను దాటితే ‘ప్రతిచర్య’ తప్పదని జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.

ఉత్తరాఖండ్‌కు సంబంధించిన ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అధికారులను అనవసరంగా కోర్టుకు పిలవడం వల్ల న్యాయస్థానం గౌరవం పెరగదని పేర్కొంది. విధుల్లో చేరని ఉత్తరాఖండ్ అధికారులకు సగం జీతం చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అనుచితంగా, అన్యాయంగా ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

 

Leave a Reply