ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీం….ఈసీ నిర్ణయమే ఫైనల్…

Share Icons:

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి ఉందని చెప్పి, ఏపీ ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలని ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఇక దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఎన్నికలు త్వరగా జరిపించాలని సుప్రీంలో పిటిషన్ వేశారు.

ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. వెంటనే ఎన్నికల కోడ్‌ను ఎత్తేయాలని సూచించింది.. ఎన్నికల విషయంలో తుది నిర్ణయం ఈసీదేనని తేల్చి చెప్పింది. ఒకవేళ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని సూచన చేసింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్ని ఆరు వారాలు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కూడా ఈసీ నిర్ణయాన్ని సమర్థించడంతో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మరి తీర్పుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్ని ఆసక్తికరంగా మారింది.

 

Leave a Reply