కన్నడ రాజకీయం: రెబల్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ….తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు

karnataka-political-crisis...congress and jds ministers resigns
Share Icons:

బెంగళూరు:

 

కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. తమ రాజీనామాలని ఆమోదించాలని సుప్రీంకోర్టుకి వెళ్ళిన రెబల్ ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించాలా, వద్దా అనే అంశంపై ఫైనల్ నిర్ణయం స్పీకర్‌దేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తి అధికారం స్పీకర్‌కి ఉందనీ, నిర్ణయం తీసుకోవడానికి గడువు ఏమి లేదని తెలిపింది.

 

అలాగే బలపరీక్షలో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని వాళ్లను బలవంతం చేసే పరిస్థితి ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల గురువారం బల పరీక్ష ఉంటే, అందులో పాల్గొనాలో, లేదో రెబెల్ ఎమ్మెల్యేలు స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. దాదాపు నెల రోజులుగా పరిపాలన అటకెక్కి… వ్యూహాలు, ప్రతివ్యూహాలతో వేడెక్కిన కర్ణాటకలో స్వార్థ రాజకీయాలకు రేపటితో బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

మొత్తం మీద సుప్రీంకోర్టు తాజాగా చెప్పిన తీర్పు… సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు బలపరీక్ష జరుగుతుందో లేదో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ జరిగితే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వేళతారో  చూడాలి.

Leave a Reply