స్వలింగ సంపర్కంపై సుప్రీం సంచలన తీర్పు

Supreme court sensational verdict on gay sex
Share Icons:

ఢిల్లీ, 6 సెప్టెంబర్:

స్వలింగ సంపర్కుల విషయంలో సుప్రీం కోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో పాటు మరో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సెక్షన్ 377ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది.

సుధీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పును వెల్లడించింది. గే సెక్స్ నేరం కాదని స్పష్టం చేసింది, లెస్బియన్స్, గేలకు సమాన హక్కులు ఉంటాయని తెలిపింది. మనుషుల వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వాలని  తెలిపింది. సెక్షన్ 377 ఏక పక్షంగా ఉందని.. అది సరైనది కాదని న్యాయస్థానం పేర్కొంది.

కాగా, ప్రకృతి విరుద్ధంగా ఇద్దరు స్త్రీల మధ్య, లేదా ఇద్దరు పురుషుల మధ్య ఉండే లైంగిక సంబంధాన్ని భారతీయ సమాజం ఒప్పుకోదు. చట్టాలు కూడా దీన్ని అంగీకరించవు. ఈ మేరకు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ దాదాపు 150 ఏళ్ల క్రితం భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 377ను తయారుచేశారు.

దీని ప్రకారం ప్రకృతి విరుద్ధమైన సంబంధం కలిగిన వారు శిక్షార్హులుగా పరిగణిస్తారు. అయితే దీన్ని కొట్టివేయాలంటూ చాలామంది స్వలింగ సంపర్కులు ఆందోళనలు  నిర్వహించారు.  వీరి నుంచే కాకుండా అనేక సామాజిక సంస్థల నుంచి 377 సెక్షన్‌ను కొట్టివేయాలంటూ సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక విచారణల అనంతరం స్వలింగ సంపర్కం నేరం కాదనే తీర్పునిచ్చింది ధర్మాసనం.

మామాట: ఇది నిజంగానే చారిత్రాత్మక తీర్పు….

Leave a Reply