సుప్రీం హెచ్చరికలతో పరుగులు పెట్టిన కేంద్రం.. 37 ఖాళీ లు

Share Icons:
  • సోమవారంలోగా భర్తీ చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక
  • ఎన్‌సీఎల్‌టీ సభ్యురాలిగా నియమితులైన రిటైర్డ్ జస్టిస్ తేలప్రోలు రజని

పలు సందర్భాలలో కేంద్రం ప్రభుత్వం  నేషన్ కంపెనీ లా ట్రిబ్యునల్ ల సభ్యుల నియామకంలో ఆలశ్యం పై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎం వి రమణ ,జస్టిస్ వై వి చంద్రచూడ్ , లావు నాగేశ్వరరావు  కేందర్ వైఖరిని తప్పు పట్టడమే కాకుండా టైం  పెట్టి నియామకాలు జరపాలని లేకపోతె కోర్ట్ ధిక్కరణకు వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్పందించిన కేంద్రం ఆగమేఘాలమీద నియామకాలు చేపట్టి ఖాళీలను భర్తీ చేసింది. …

సుప్రీంకోర్టు హెచ్చరికలపై కేంద్రం పరుగులు పెట్టి అప్పటికప్పుడు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో 8 మంది జ్యుడీషియల్, 10 మంది సాంకేతిక సభ్యులను నియమించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ)లో ఆరుగురు జ్యుడీషియల్, ఏడుగురు అకౌంటెంట్ సభ్యులను నియమించింది. అలాగే, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్‌లో ఆరుగురు జ్యుడీషియల్ సభ్యులను నియమించింది. మొత్తంగా ఈ మూడింటిలో కలిపి 37 ఖాళీలను ఆగమేఘాల మీద భర్తీచేసింది.

ఎన్‌సీఎల్‌టీ సభ్యురాలిగా నియమితులైన తేలప్రోలు రజని ఏపీ హైకోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి. 1958లో ప్రకాశం జిల్లా అన్నంభొట్లవారిపాలెంలో జన్మించారు. 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1981లో గుంటూరులో లా ప్రాక్టీస్ ప్రారంభించిన రజని.. 2002లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కరీంనగర్, మెదక్, హైదరాబాద్ న్యాయస్థానాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన రజని.. మే 2020లో పదవీ విరమణ చేశారు.

కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply