TRENDING NOW

ఇక ఇష్టమే ఫైనల్.. తప్పు కాదు

ఇక ఇష్టమే ఫైనల్.. తప్పు కాదు

ఇటీవల భారత సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక తీర్పులను వెలువరిస్తోంది.  ముఖ్యంగా అటు మోదీ ప్రధానిగా ఉండగా,  సీజేఐ దీపక్ మిశ్రా దూకుడు పెంచారు.  పదవీ కాలం ముగిసే క్షణాలు దగ్గరపడుతుండగా వేగంగా ప్రధాన సమస్యలపై సర్వోన్నత న్యాయస్థానం వెనువెంటనే తీర్పులు ప్రకటిస్తోంది. దీనిపై పలువురు న్యాయనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వివాహం అనేది ఇరువురి జీవితాలకు, ఇరువురి మనసులకు , జీవన విధానానికి సంబంధించింది.  అట్లా అని, మూడు ముళ్లతో ఒక వ్యక్తిని మాత్రమే బంధించడం న్యాయసమ్మతం కాదు. ఆధునిక సమాజంలో వివక్షకు తావు ఉండకూడదు.  తప్పని పించినపుడు గతంలో సతీ సహగమనాన్ని నివారించాము కదా, మరి ఈ తీర్పు కూడా అంతే, సంచలనమైన తీర్పు కాదు, చారిత్రాత్మకమైన తీర్పుగా చెప్పవచ్చు.

497 సెక్షన్‌లో వున్న పురుషాహంకారానికి చెక్ పెట్టింది సుప్రీం తీర్పు. కానీ భార్యాభర్తల్లో అధిక శాతం భర్తలే సంపాదిస్తూ, భార్యలు పరాన్నజీవులుగా వున్న సమాజంలో   మహిళలకి  ఏ యితర రక్షణలూ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏమి జరగనుంది? ఈ తీర్పు సత్ఫలితాలనిస్తుందా.  అలాగే తీర్పుపై ” Abolition of sections 377&497 will increase homosexuality and semi legalised prostitution which disturbs Indian social fabric. ”  అనేవాదన కూడా వినిపిస్తోంది, సామాజిక మాధ్యమాలలో.  అయితే మనం గతంలో పలు చట్టాలను సంస్కరించుకున్నాం. మంచీ చెడూ వివేచించుకున్నాం ఈ తీర్పుకూడా అందుకు మినహాయింపు కాదు కదా.   భారతీయ వివాహ వ్యవస్థలో మాంగల్య ధారణ ముఖ్యమైనది, పెళ్లిలో అదో ప్రధాన తంతు.. మా౦గల్యధారణ సమయంలో వధూవరులు …
మా౦గళ్య౦త౦తునా నేన
మమ జీవనహేతునా|
క౦ఠే బధ్నామి సుభగే
త్వ౦ జీవ శరదా౦ శతమ్

నూరు స౦వత్సరాలు మె౦డైన, ని౦డైన ఆన౦ద౦ కోస౦, ఆయురారోగ్యాల కోస౦ మ౦గళప్రదమైన ఈ మా౦గల్యాన్ని, నీ క౦ఠమున౦దు ధరి౦పజేయుచున్నాను.

అనే వేద మంత్రాల సాక్షిగా వివాహ బంధంలోకి సప్తపదితో అడుగుపెడుతున్నారు. ఈ బంధానికి కలంకం తీసుకువచ్చే విధానం సామాజిక తప్పిదం. మనిషి బలహీనత. అటువంటి వాటికి చట్టపరిధిలో విచారణ జరపవలసినపుడు భార్య-భర్తకు సమాన న్యాయం వర్తింపచేయాలి.. అదే సుప్రీం కోర్టు తీర్పులో ఉన్నది. అంతే… అది సంచలనం కాదు… సంస్కరణం. మరి మీరేమంటారు. అంగీకరిస్తారా? వ్యతిరేకిస్తారా??

మామాట: కొత్త తీర్పులపై ఆరోగ్యకర చర్చ జరగవలసిందే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: