హిందీ బాషని బలవంతంగా రుద్దవద్దు…

astrologer balaji comments on rajanikanth
Share Icons:

చెన్నై: ఈ నెల 14న ప్రపంచ హిందీ దినోత్సవాల సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మన దేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ కనుక, ఆ భాష మన దేశాన్ని సమైక్యంగా ఉంచగలదని చెప్పిన విషయం తెలిసిందే. ప్రజలు తమ స్థానిక భాషను సాధ్యమైనంత ఎక్కువగా వాడాలని కూడా ఆయన చెప్పారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. అటు బీజేపీ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా కన్నడ ప్రాముఖ్యతతో రాజీ పడేది లేదని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే అమిత్ షా వ్యాఖ్యలపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఉమ్మడి భాష మన దేశానికి మంచిదే అయినప్పటికీ ఏ భాషనూ బలవంతంగా ప్రజలపై రుద్దకూడదని చెప్పారు. హిందీని బలవంతంగా రుద్దకూడదని రజనీకాంత్ చెప్పారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమూ ఆమోదించదని చెప్పారు. ఆ మాటకొస్తే కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు సైతం హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తాయన్నారు. హిందీ మాత్రమే కాదని, ఏ భాషనైనా సరే బలవంతంగా రుద్దకూడదని చెప్పారు. ఉమ్మడి భాష ఉన్నట్లయితే దేశ సమైక్యతకు, అభివృద్ధికి మంచిదేనని, అయితే భాషను బలవంతంగా రుద్దడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

అయితే గత ఐదు సంవత్సరాలుగా మోడీ  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్ధిస్తున్న రజనీకాంత్..ఇప్పుడు హిందీ బాషపై వ్యతిరేకంగా మాట్లాడటం గమనార్హం. ఇదిలా ఉంటే అమిత్ షా వ్యాఖ్యలపై దక్షిణాదిలో చాలా వ్యతిరేకిత వచ్చింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ లాంటి రాష్ట్రాల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది.

ఇటీవల డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, కర్ణాటక సీఎం యడియూరప్పలతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అమిత్ షా వ్యాఖ్యలపై ట్వీట్ చేస్తూ.. హిందీ భాష దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకొస్తుందనుకోవడం చాలా అసంబద్ధం. భారతీయులందరికీ హిందీ మాతృ భాష కాదు. వారందరిపై హిందీ భాషను బలవంతంగా రుద్దాలనుకోవడం వారిని బానిసలుగా మార్చడం లాంటిదే అని ఆయన కామెంట్ చేశారు. అటు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా ఈ వివాదంపై గళం విప్పారు.  ఏదైనా ఒక కొత్త చట్టం, కొత్త పథకం ప్రవేశపెట్టేముందు ప్రజల అభిప్రాయాలను సేకరించాలంటూ కేంద్రానికి చురకలు వేశారు. అంతేకాదు బలవంతంగా హిందీని తమపై రుద్దాలని చూస్తే మరో జల్లికట్టు తరహా ఉద్యమానికి సిద్ధమవుతామంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

 

Leave a Reply