ఇకపై సన్నీలియోన్ రాత్రి పది దాటిన తర్వాతే!?

Share Icons:

ఇకపై సన్నీలియోన్ రాత్రి పది దాటిన తర్వాతే టీవీల్లో!?

సన్నీ లియోనా… మజాకా… ఆమె పేరు వినగానే నిద్రలోంచి దిగ్గున లేచే కుర్రకారు నేటికీ ఉంది.

నోరెళ్లబెట్టుకుని, కళ్ళార్పకుండా,  తెల్లవార్లు తెరకు అతుక్కుపోతారు.

ఈ అమ్మడు.. నీలి చిత్రాలకు గుడ్ బై చెప్పి.. .అదేనండి అక్కడ మొహం మొత్తడంతో భారతీయ చిత్రరంగంలోకి అడుగు పెట్టింది. ఇక సినిమా ప్రేక్షకులకు పిచ్చేక్కించి మెల్లగా ప్రకటనల ద్వారా బుల్లి తెరపై అర్ధనగ్నంగా దర్శనం ఇవ్వడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా  ఈ  మధ్య సన్నీలియోన్ ఓ కండోమ్ యాడ్‌లో నటించింది.

ఈ ప్రకటన బుల్లితెరపై ఎప్పుడుపడితే అప్పుడు రావడంతో కుటుంబంతో టీవీ చూసేవాళ్లకి ఇబ్బందికరంగా మారింది.

దీనిపై మహారాష్ట్ర మహిళా కమిషన్, అడ్వైర్టైజింగ్ స్టాండర్డ్స్  కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్‌సీఐ)కి ఫిర్యాదు చేసింది.కండోమ్ యాడ్స్ ఇకపై రాత్రివేళల్లో మాత్రమే ప్రసారమయ్యేలా చూడాలని ప్రస్తావించింది.

దీనిపై అన్ని టెలివిజన్ చానెళ్లకు తాము సలహా ఇస్తామని ఏఎస్‌సీఐ పేర్కొంది. యాడ్స్‌లో మహిళలపై అసభ్యత, అశ్లీలత లేకుండా చూడాలని సూచించింది. ఈ నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 పెద్దలు మాత్రమే చూసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వశాఖ ఏఎస్‌సీఐకి సూచించింది.

సన్నిలియోన్ పేరు చెబితే సెన్సార్ బోర్డుకే కాదు.. బుల్లి తెరకు వణుకే…

Leave a Reply