సన్నీలియోన్ దంపతులకు కవల పిల్లలు!!

Share Icons:

ముంబై, 5 మార్చి:

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మరో ఇద్దరు పిల్లలకు అమ్మయింది. గతేడాది మహారాష్ట్రలోని లాతూర్ నుంచి ఓ పాపను దత్తత తీసుకున్న సన్నీ, వెబర్ దంపతులు.. ఇప్పుడు ఇద్దరు కవల మగ పిల్లలను తమ ఫ్యామిలీలోకి వెల్‌కమ్ చెప్పారు.

ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా సోమ‌వారం స‌న్నీ భ‌ర్త వెబ‌ర్ వెల్ల‌డించారు.

ఇంత తక్కువ టైమ్‌లో మా కుటుంబంలోకి ముగ్గురు పిల్లలు రావడం సంతోషంగా ఉంది అంటూ.. తన భర్త డానియల్‌తో పాటు ముగ్గురు పిల్లల్ని ఒళ్లో కూర్చుని ఉన్న ఫొటోని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. మగపిల్లలకు అషర్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్ అనే పేర్లు పెట్టింది.

ముగ్గురు పిల్లలను పెంచడం సాధ్యమేనని తనకు అనిపించిందని, అందుకే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నామని తన సందేశంలో పేర్కొంది.

ఇది గాడ్స్ ప్లాన్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ శృంగార తార ఆనందం వ్యక్తం చేస్తోంది. ముగ్గురు పిల్లల తల్లిదండ్రులుగా తాము చాలా గర్వపడుతున్నామని సన్నీ చెప్పింది. అందరినీ ఈ రకంగా సర్‌ప్రైజ్ చేస్తున్నట్లు ఆమె తెలిపింది.

అటు ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేశాడు.

అయితే ఈ ఇద్దరు కవల పిల్లలను కూడా దత్తతకు తీసుకున్నారా లేక సరోగసీ ద్వారా వీళ్లకు జన్మనిచ్చారా అన్నదానిపై స్పష్టత లేదు.

మామాట: అమ్మడు ఆదర్శంగా నిలుస్తుందిగా…

English Summary: Actress Sunny Leone and husband Daniel Weber have a new reason to celebrate. The couple on Monday announced the birth of twins Noah and Asher. In a post on Instagram, the 36-year-old actress wrote that “our family is now complete with Asher Singh Weber, Noah Singh Weber and Nisha Kaur Weber.

One Comment on “సన్నీలియోన్ దంపతులకు కవల పిల్లలు!!”

Leave a Reply