ఏపీలో ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

Share Icons:

అమరావతి,ఏప్రిల్ 18,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఈ నెల 23 ఆఖరి పనిదినమని పేర్కొన్న ఏపీ విద్యాశాఖ.. 24 నుంచి సెలవులు ప్రకటించినట్టు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని విద్యాశాఖ పేర్కొంది. సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వేసవి సెలవులు ప్రకటించింది.

మామాట: మంచిది పిల్లలను కాస్త ఆడుకోనివ్వండి

Leave a Reply