వేసవిలో తాటిముంజలు- ప్రయోజనాలు

Share Icons:

తిరుపతి, ఏప్రిల్ 18,

ప్రకృతి ఎంతో ముందుచూపుకలది. మానవులకు ఋతువులకు అనుకూలంగా, తగిన ఫలాలు, కాయలు, పూలు, ఆకులతో సేదదీరడానికి ఏర్పాటు చేసిపెట్టింది. మండు వేసవిలో ఎండ వేడిమి నుంచీ ఉపశమనం పొందడానికి తాటిముంజలకంటే మెరుగైన ఆహారం లేదు. గతంలో ప్రతీ పల్లెపట్టూనా తాటి చెట్లు ఉండేవి. ముంజలు విరవిగా లభించేవి. జనావాసాలు పెరుగుతూ.. ఇపుడు తాటిచెట్టే లేకుండా పోతోంది. పూర్వం ఈ చెట్టుకు కల్పవృక్షం అని పేరు..

ఎండాకాలంలో తాటిముంజలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని ఈ కాలంలో తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం ముంజల్లో ఎక్కువగా ఉంటుంది.   ముంజల్లో విటమిన్ ఎ, బి, సి,ఐరన్ జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలున్నాయి. ఇవి శరీరంలోని అనవసర పదార్థాలను బయటికి పంపపుతాయి. ఈ కారణంగా శరీరం అంతర్గతం శుభ్రమవుతుంది. వీటిని తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.

వీటిలోని నీటిశాతం పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్‌ని కలిగిస్తుంది. ఈ కారణంగా త్వరగా ఆకలి వేయదు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ ముంజలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లబరిచే గుణం ముంజలకు ఉంటుంది. వీటిని తినడం వల్ల అలసట తగ్గుతుంది. మిగతా సమయాలతో పోల్చుకుంటే ఈ సీజన్‌లో వీటిని తీసుకోవడం వవల్ల అలసట, నీరసం దూరమై తక్షణ శక్తి పొందుతాం. మలబద్ధక సమస్యను నివారించడంలో తాటి ముంజలు బాగా పనిచేస్తాయి.

రెగ్యులర్‌గా వీటిని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి, ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. గర్భిణీలు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. అందం పరంగా కూడా ముంజలు బాగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల మొటిమలు కూడా తగ్గుతాయి.కాబట్టి కేవలం ఎండాకాలంలోనే దొరికే ఈ అద్భుత ఆహారాన్ని మిస్ చేసుకోవద్దు.

మామాట: ముజలు ముక్కల్దాకా తిన్నా ఏంకాదు.

Leave a Reply