TRENDING NOW

సుమంత్ – చైతూ మధ్య వార్?

సుమంత్ – చైతూ మధ్య వార్?

 హైదరాబాద్, అక్టోబర్ 18,

అక్కినేని ఇంటి కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యభరిత చిత్రం ఇదం జగత్. అంజు కురియన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

పెద్ద హడావుడి ఏమీ లేకుండానే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు కూడా ముగింపు దశలో ఉన్నాయి. త్వరలోనే సెన్సారు అధికారులకు  చూపించాలని ప్లాన్ చేస్తున్నారు. కుటుంబ కథాచిత్రాల కథానాయకుడు సుమంత్ ఈ చిత్రంలో తను ఇప్పటివరకూ చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలోనే తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాకు సంబంధింతి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర  చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది.

కాగా, అదే ఫ్యామిలీకి చెందిన అక్కినేని నాగ‌చైత‌న్య కొత్త సినిమా.. స‌వ్య‌సాచి కూడా న‌వంబ‌ర్ 2నే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పుడు సుమంత్ కూడా నవంబరు ప్రథమార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించడంతో అక్కినేని అభిమానుల్లో ఉత్కంఠత  నెలకొంది.

మామాట: చైతు, సుమంత్ చిత్రాల్లో ఎవ‌రి సినిమా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: