బొత్సకు కౌంటర్ ఇచ్చిన సుజనా:బొత్సకు ఏది ఏంటో తెలియదు..

sujana chowdary comments on ysrcp govt
Share Icons:

అమరావతి:

గత రెండు రోజులుగా మంత్రి బొత్స సత్యనారాయణ, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు రాజధాని ప్రాంతంలో భూములన్నాయన్న మంత్రి బొత్స వ్యాఖ్యలపై సుజనా చౌదరి స్పందించారు. ‘రాజధాని అంటే చొక్కా మార్చుకున్నట్లు కాదు. బొత్స ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్ల లోపాలు కప్పిపుచ్చుకునేందుకు ఇలా మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి రంగంలో అట్టర్‌ఫ్లాప్‌ అయింది.

బొత్స భాషా ప్రావీణ్యాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఆయన మాట్లాడిన తీరు నవ్వొస్తుంది. 120 కంపెనీల్లో బొత్స చెప్పిన కంపెనీ పేరు లేదు. వాస్తవాలకు దగ్గరగా చెబితే ప్రజలు నమ్ముతారు. బొత్సకు సీడ్‌ కేపిటల్‌ ఏదో, సీఆర్డీఏ పరిధి ఏదో తెలియదు.

వీరులపాడు మండలంలో మా అమ్మమ్మ ఊర్లో మాకు భూములున్నాయి. భూములున్నాయంటున్నారు అవి ఎప్పుడు కొన్నారో చెప్పాలి. వాళ్ల వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ నా మీద ఆరోపణలు చేస్తోంది. నా మీద రాజకీయ ఆరోపణలు చేయడం కాదు..బొత్స సరైన ఆధారాలు తీసుకొచ్చి మాట్లాడాలి. చంద్రబాబు రాజధానిని అప్పుడే వేగంగా పూర్తి చేసి ఉంటే ఇంత సమస్య ఉండేది కాదు. అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు సమస్య. రాజధానిలో రైతులు భయాందోళనలో ఉన్నారు. మంత్రులు తలో రకమైన స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం వల్ల రైతులు గందరగోళంలో పడ్డారని అన్నారు.

Leave a Reply