వైఎస్సార్ బయోపిక్‌లో సుహాసిని?

suhasini acted ysr biopic yatra
Share Icons:

హైదరాబాద్, 14 జూన్:

ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ చిత్రాల నిర్మాణం ఎక్కువగా నడుస్తోంది. ఇటీవలే సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం ఘనవిజయం సాధించింది.

ఇక అదే బాటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రకి సంబంధించి ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ని హీరో నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ, నటించనున్నారు.

అలాగే మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా `యాత్ర‌` పేరుతో ఓ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

మ‌హి వి రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో వైఎస్సార్‌గా మ‌ల‌యాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ష‌ర్మిలగా భూమిక‌, వైఎస్ అనుచ‌రుడు సూరీడు పాత్ర‌లో పోసాని కృష్ణ ముర‌ళీ, విజ‌య‌మ్మ‌గా ఆశ్రిత పొన్న‌గంటి (బాహుబ‌లి-2 ఫేమ్‌) నటిస్తున్నార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఇలాంటిదే మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి మ‌హిళా హోం మంత్రిగా ప‌నిచేసిన స‌బితా ఇంద్రారెడ్డి పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి సుహాసిని క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈ పాత్ర కోసం చిత్ర‌బృందం సుహాసినిని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. మరి, ఈ వార్త‌లో నిజమో ఎంతో ఉందో తెలియాల్సి ఉంది.

మామాట: హోమ్ మినిస్టర్‌ పాత్రలో సుహాసిని సెట్ అవుతుంది అనుకుంటా…

Leave a Reply