విజయానికి క్రమశిక్షణ అవసరం

Share Icons:

విజయానికి క్రమశిక్షణ అవసరం

ప్రస్తుతం సమాజంలో యువతకు చదువుతో పాటు, గమ్యానికి చేరుకునేందుకు సరైన దిక్సూచిని తప్పక పాటించాల్సిన అవసరాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. జీవితంలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాముఖ్యత, సబ్జెక్ట్‌లో సాదించాల్సిన నైపుణ్యం గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. విజయానికి క్రమశిక్షణ అవసరం. అందరూ ఆశావాహ దృక్పథాన్ని అలవర్చుకుంటే, తద్వారా కష్టపడే తత్వం పెరుగుతుంది. దేశం ఉన్నత స్థితికి చేరేందుకు యువత ఎంతగానో కృషి చేయాసిన అవసరం అందరూ తెలుసుకోవాలి. సమాజంలో కొందరి నిర్లక్ష్య ధోరణి వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి, చట్టాల ద్వారా వాటిని నిర్మూలించి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన సమయం ఆసన్న్మైంది. జీవితం, చదువు రెండు వేర్వేరు అంశాలని, రెండింటినీ పోల్చిచూడటం సరికాదు. జీవితంలో సాధ్యం కాని వాటిని సినిమాలలో చూసి యువత వాటికి అలవాటు పడకూడదు. మంచి, చెడును స్వయంగా గుర్తించాలి. ఆచరణ, అమలులో కచ్చితత్వం ఉండాలి.

నైపుణ్యంతోనే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాస్ధ్య మవుతుంది. ప్రస్తుతం రాణించాలంటే చదువుకంటే నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ రోజుల్లో చదువుకు 13, నైపుణ్యానికి 87శాతం ప్రాధాన్యత ఉంది. వీటిని గుర్తించిన ఇతర దేశాలు ముందంజలో ఉన్నాయని గుర్తెరగాలి. ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం ఆ సమస్యను, సమయాన్ని బట్టి అంచనా వేయాలి, అటువంటి సమయంలో ఒత్తిడికి గురి కాకూదు.. ఎక్కడ రాణించాలనా కసి-పట్టుదల అవసరం. అదే అసలైన ఆయుధం.

ఉత్తేజంతోనే ప్రశ్నించే తత్వం: సమాజంలో అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించే వారే నూతన ఆవిష్కరణలను చేపట్టగలరు. ఉత్తేజంతోనే ప్రశ్నించే తత్వం మొదలవుతుంది.జీవితంలో నాలుగు అంశాలపై ఆదారపడి భవిష్యత్తు ముందుకెళుతుంది  అవి ఏమంటే. ఒకటి వారి గురించి(బలాలు, బలహీనతలు, ప్రవర్తన) తెలుసుకోవడం, రెండు వారికున్న శక్తులను వినియోగించుకుంటున్నారా.. లేదా.. అనే విషయాన్ని పరిశీలించుకోవడం, మూడు సమాజంలో తమ ప్రాత ఏమిటి..? నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నాని ప్రశ్నించుకోవడం. నాలుగు చిన్నచిన్న విషయాలకే ఒత్తిడికి గురి కాకుండా లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయాణించడం వంటి అంశాలపై ఆధారపడితే భవిష్యత్తు ఉంటుంది. ప్రతి సంవత్సరం మూడు వేల మందికిపైగా ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అంచనా… ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందో ఆ పరిసరాల్లోనే ప్రేమ విరజిల్లుతుందనేది సర్వజన విశ్వాసం.

యువత తమ కర్తవ్యాన్ని తెలుసుకోవాలి:: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో యువత పెడదోవన పయనిస్తోందన్న ఆందోళన పలువురు పెద్దలలఓ వ్యక్తమవుతున్నది. అందువలన తమ కర్తవ్యాన్ని గుర్తెరిగి అవసరమైన సృష్టిని ఏర్పర్చుకోవాలని యువతకు సూచితున్నారు. ఫేస్‌బుక్‌లు వాడేవారిలో పలువురు సమాజాన్ని ఎదుర్కోలేకపోతున్నారని, సామాజిక, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో మంచి వాటిని స్వీకరించి తమ ఎదుగుదలకు బాటలుగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్దలు సలహా ఇస్తున్నారు. .

మనదేశం అద్భుతమైన యువశక్తితో నిండి ఉంది. మనం కోరుకునే భవిష్యత్తు ఏదైనా సరే, యువతను తప్పనిసరిగా కేంద్రంగా చేయాలి. ఇలా చేసినట్లయితే, మనం ఎవ్వరితో పోల్చలేని విధంగా ముందుకు సాగిపోగలం. మన దేశంలో యువతను మనం ఎలా చూస్తామనేది చాలా ముఖ్యమైనది. వారిని కేవలం కొత్త తరం వోటర్లుగా పరిగణించడం పెద్ద తప్పు, వారు కొత్త తరం శక్తి. ఒక వ్యక్తిలో ఉండే గొప్ప గుణం ఆత్మ విశ్వాసం. మీరు ఏదైనా సాధించగలమని విశ్వసించినట్లయితే, తప్పకుండా మీరు దాన్ని సాధిస్తారు. మీరు ఏదైనా సాధించలేమని భావిస్తే, మీరు దానిని సాధించే అవకాశాలు కూడా తగ్గుతాయి. – క్రీడలనేవి శరీర దారుఢ్యాన్ని పెంచేవిగా మాత్రమే కొందరు భావిస్తారు. మనస్సును ఉద్దీపనం చేసి, క్రమశిక్షణతో కూడిన సంస్కృతిని తీసుకువచ్చే విద్యా పరికరకరంగా భావించాలి. విషయాలను ఒక్కతాటిపై తీసుకురావటమే కాకుండా, వాటి మార్గాన్ని మార్చే సామర్థ్యం యువతకు ఉంది. వారు సమైక్యంగా వచ్చి, మార్పును తీసుకురాగలరు. ఏ దానిని ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు, కానీ మార్పులు తేవల్సిన అవసరం ఉంది. సందిగ్ధత నుంచి బయటకు వచ్చి, సంకల్పంతో ఉండే వారినే యువతగా పరిగణనలోకి వస్తుంది. ఉన్నత విద్యకు నిలయాలైన విశ్యవిద్యాలయాలు లేదా సంస్థలు అందించే ఏ విద్యైనా సరే, అది తప్పనిసరిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ, ప్రస్తుత కాలానికి అనుగుణంగా అది విశాలంగా, వైవిధ్యంగా ఉండాలి. జీవితాంతం విద్యార్థులుగానే ఉండాలి. జీవితంలోని ప్రతి సందర్భం నుంచి నేర్చుకునే ప్రగాఢ కాంక్ష ఉండాలి. జీవితంలోని ప్రాథమిక అంశాలు అభ్యాసంతో పెనవేసుకుపోవాలి. ఈ నేర్చుకునే విధానం మన డిఎన్ఏలో భాగం కావాలి.

విశ్యవిద్యాలయాలు కేవలం మర మనుషులను (రోబోట్లను) తయారు చేసే విధానం కాకుండా, మంచి మనిషులను కూడా తయారు చేయాలి. జీవితంలో మనోభావాలు లేకుండా మనం ప్రజానీకానికి ఉపయోగపడలేం. 21వ శతాబ్ధం ఒక విజ్ఞానపు శతాబ్ధం, విజ్ఞాన ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సినప్పుడల్లా ప్రపంచం భారత్ వైపు దృష్టి సారించింది. విజ్ఞానంతో కూడిన సమాజాభివృద్ధి ఇకపై నినాదం కాదు, ఇది వాస్తవరూపం దాల్చింది. మానవ అభివృద్దిలో జరిగే అన్ని కార్యకాలాపాలలో కెల్లా విజ్ఞానం కీలకమైనది.

ప్రజాస్వామ్యపు వేళ్లు సామూహిక విద్యలోనే ఉన్నాయి. ఈ పునాది మరింత పటిష్టంగా మారాలి, రేపటి పౌరులైన పిల్లలు కూడా ఎన్నికల ప్రక్రియ గురించి చదుకోవాలి. ఒక దేశ ప్రతిష్ట అంటే కేవలం ఆర్థిక, సైనిక సామర్థ్యాలే కావు. ఒక దేశం మృదు స్వభావం కూడా భిన్నమైన దృష్టిని కల్పిస్తుంది. అలాంటి మృదు స్వభావ శక్తిలో క్రీడలు ఒకటి. దీని ద్వారా భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. మన జీవితంలో క్రీడలకు ప్రాముఖ్య లేకపోయినట్లయితే, సమాజంలో మనం క్రీడాస్ఫూర్తిని అందించలేం. మన సామాజిక జీవితంలో క్రీడలు అనివార్యం, విడదీయరానివి.

యువత రూపంలో భారతదేశానికి కొత్త శక్తి ఉంది. ప్రజాస్వామ్యపు రూపును మార్చుకునే సామర్థ్యం భారతదేశానికి ఉంది.  మనం జీవించడానికి ప్రపంచం ఉత్తమ ప్రదేశంగా ఉండాలంటే, మనం దానిని ఒక యూనిట్‌గా తీసుకోవాలి. ఆర్థిక వృద్ధి వ్యాప్తి చెందాలని కోరుకుంటే అందులో మనం ప్రజలను భాగస్వాములు చేయాలి. అభివృద్ధి విధానం స్థిరంగా కొనసాగాలంటే, వాతారణంతో మనం పనిచేయాలి.

యువత రూపంలో భారతదేశానికి కొత్త శక్తి ఉంది. ప్రజాస్వామ్యపు రూపును మార్చుకునే సామర్థ్యం భారతదేశానికి ఉంది. సమాజంలో మార్పు తీసుకురావాలని చేసే చిన్న ప్రయత్నాలు కుడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. సమాచారం అనేది చేతికర్రలా ఉపయోగపడి, మార్గం దాటేందుకు తోడ్పడాలి. కానీ మార్గాన్ని చీకట్లో వెతుక్కోవాలని ప్రయత్నిస్తే, కేవలం విజ్ఞానం మాత్రమే మీరు మార్గం చూపిస్తుంది.  చదవటం అనేది అభివృద్ధికి ఇంధనంగా మారుతుంది. రూపం, వ్యక్తీకరణ లేని విజ్ఞానం అనేది అర్థరహితమైంది. దీపపు కాంతి మాదిరిగా, ప్రతిఒక్కరికీ వృద్ధి చెందాలనే సహజ స్వభావం ఉండాలి. ఈ విధానాన్ని అవలంబించుకోవాలి. ప్రతిఒక్కరిలో మంచి, చెడులు ఉంటాయి. మంచిపై దృష్టి సారించాలని నిర్ణయించుకునే వారు జీవితంలో విజయం సాధిస్తారు. కష్టపడి పనిచేస్తే, అలసట ఉండదు, సంతృప్తి మిగులుతుంది. సమాజానికి సేవ చేసే అవకాశాన్ని పొందటం ద్వారా, మనం మన రుణాన్ని చెల్లించుకు అవకాశాన్ని పొందుతాం .

ప్రస్తుతం సమాజంలో యువతకు చదువుతో పాటు, గమ్యానికి చేరుకునేందుకు సరైన దిక్సూచిని తప్పక పాటించాల్సిన అవసరాన్ని ఇప్పుడిప్పుదే గుర్తిస్తున్నారు. జీవితంలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాముఖ్యత, సబ్జెక్ట్‌లో సాదించాల్సిన నైపుణ్యం గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. విజయానికి క్రమశిక్షణ అవసరం. అందరూ ఆశావాహ దృక్పథాన్ని అలవర్చుకుంటే, తద్వారా కష్టపడే తత్వం పెరుగుతుంది. దేశం ఉన్నత స్థితికి చేరేందుకు యువత ఎంతగానో కృషి చేయాసిన అవసరం అందరూ తెలుసుకోవాలి. సమాజంలో కొందరి నిర్లక్ష్య ధోరణి వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి, చట్టాల ద్వారా వాటిని నిర్మూలించి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన సమయం ఆసన్న్మైంది. జీవితం, చదువు రెండు వేర్వేరు అంశాలని, రెండింటినీ పోల్చిచూడటం సరికాదు. జీవితంలో సాధ్యం కాని వాటిని సినిమాలలో చూసి యువత వాటికి అలవాటు పడకూడదు. మంచి, చెడును స్వయంగా గుర్తించాలి. ఆచరణ, అమలులో కచ్చితత్వం ఉండాలి.

నైపుణ్యంతోనే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాస్ధ్య మవుతుంది. ప్రస్తుతం రాణించాలంటే చదువుకంటే నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ రోజుల్లో చదువుకు 13, నైపుణ్యానికి 87శాతం ప్రాధాన్యత ఉంది. వీటిని గుర్తించిన ఇతర దేశాలు ముందంజలో ఉన్నాయని గుర్తెరగాలి. ప్రతి ఒక్కరి ఆలోచనా విధానం ఆ సమస్యను, సమయాన్ని బట్టి అంచనా వేయాలి, అటువంటి సమయంలో ఒత్తిడికి గురి కాకూడదు.. ఎక్కద రాణించాలనా కసి-పట్టుదల అవసరం. అదే అసలైన ఆయుధం.

ఉత్తేజంతోనే ప్రశ్నించే తత్వం: సమాజంలో అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించే వారే నూతన ఆవిష్కరణలను చేపట్టగలరు. ఉత్తేజంతోనే ప్రశ్నించే తత్వం మొదలవుతుంది.జీవితంలో నాలుగు అంశాలపై ఆదారపడి భవిష్యత్తు ముందుకెళుతుంది  అవి ఏమంటే. ఒకటి వారి గురించి(బలాలు, బలహీనతలు, ప్రవర్తన) తెలుసుకోవడం, రెండు వారికున్న శక్తులను వినియోగించుకుంటున్నారా.. లేదా.. అనే విషయాన్ని పరిశీలించుకోవడం, మూడు సమాజంలో తమ ప్రాత ఏమిటి..? నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నాని ప్రశ్నించుకోవడం. నాలుగు చిన్నచిన్న విషయాలకే ఒత్తిడికి గురి కాకుండా లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయాణించడం వంటి అంశాలపై ఆధారపడితే భవిష్యత్తు ఉంటుంది. ప్రతి సంవత్సరం మూడు వేల మందికిపైగా ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అంచనా… ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందో ఆ పరిసరాల్లోనే ప్రేమ విరజిల్లుతుందనేది సర్వజన విశ్వాసం.

యువత తమ కర్తవ్యాన్ని తెలుసుకోవాలి:: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో యువత పెడదోవన పయనిస్తోందన్న ఆందోళన పలువురు పెద్దలలఓ వ్యక్తమవుతున్నది. అందువలన తమ కర్తవ్యాన్ని గుర్తెరిగి అవసరమైన సృష్టిని ఏర్పర్చుకోవాలని యువతకు సూచితున్నారు. ఫేస్‌బుక్‌లు వాడేవారిలో పలువురు సమాజాన్ని ఎదుర్కోలేకపోతున్నారని, సామాజిక, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో మంచి వాటిని స్వీకరించి తమ ఎదుగుదలకు బాటలుగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్దలు సలహా ఇస్తున్నారు. .

మనదేశం అద్భుతమైన యువశక్తితో నిండి ఉంది. మనం కోరుకునే భవిష్యత్తు ఏదైనా సరే, యువతను తప్పనిసరిగా కేంద్రంగా చేయాలి. ఇలా చేసినట్లయితే, మనం ఎవ్వరితో పోల్చలేని విధంగా ముందుకు సాగిపోగలం. మన దేశంలో యువతను మనం ఎలా చూస్తామనేది చాలా ముఖ్యమైనది. వారిని కేవలం కొత్త తరం వోటర్లుగా పరిగణించడం పెద్ద తప్పు, వారు కొత్త తరం శక్తి. ఒక వ్యక్తిలో ఉండే గొప్ప గుణం ఆత్మ విశ్వాసం. మీరు ఏదైనా సాధించగలమని విశ్వసించినట్లయితే, తప్పకుండా మీరు దాన్ని సాధిస్తారు. మీరు ఏదైనా సాధించలేమని భావిస్తే, మీరు దానిని సాధించే అవకాశాలు కూడా తగ్గుతాయి. – క్రీడలనేవి శరీర దారుఢ్యాన్ని పెంచేవిగా మాత్రమే కొందరు భావిస్తారు. మనస్సును ఉద్దీపనం చేసి, క్రమశిక్షణతో కూడిన సంస్కృతిని తీసుకువచ్చే విద్యా పరికరకరంగా భావించాలి. విషయాలను ఒక్కతాటిపై తీసుకురావటమే కాకుండా, వాటి మార్గాన్ని మార్చే సామర్థ్యం యువతకు ఉంది. వారు సమైక్యంగా వచ్చి, మార్పును తీసుకురాగలరు. ఏ దానిని ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు, కానీ మార్పులు తేవల్సిన అవసరం ఉంది. సందిగ్ధత నుంచి బయటకు వచ్చి, సంకల్పంతో ఉండే వారినే యువతగా పరిగణనలోకి వస్తుంది. ఉన్నత విద్యకు నిలయాలైన విశ్యవిద్యాలయాలు లేదా సంస్థలు అందించే ఏ విద్యైనా సరే, అది తప్పనిసరిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ, ప్రస్తుత కాలానికి అనుగుణంగా అది విశాలంగా, వైవిధ్యంగా ఉండాలి. జీవితాంతం విద్యార్థులుగానే ఉండాలి. జీవితంలోని ప్రతి సందర్భం నుంచి నేర్చుకునే ప్రగాఢ కాంక్ష ఉండాలి. జీవితంలోని ప్రాథమిక అంశాలు అభ్యాసంతో పెనవేసుకుపోవాలి. ఈ నేర్చుకునే విధానం మన డిఎన్ఏలో భాగం కావాలి.

విశ్యవిద్యాలయాలు కేవలం మర మనుషులను (రోబోట్లను) తయారు చేసే విధానం కాకుండా, మంచి మనిషులను కూడా తయారు చేయాలి. జీవితంలో మనోభావాలు లేకుండా మనం ప్రజానీకానికి ఉపయోగపడలేం. 21వ శతాబ్ధం ఒక విజ్ఞానపు శతాబ్ధం, విజ్ఞాన ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సినప్పుడల్లా ప్రపంచం భారత్ వైపు దృష్టి సారించింది. విజ్ఞానంతో కూడిన సమాజాభివృద్ధి ఇకపై నినాదం కాదు, ఇది వాస్తవరూపం దాల్చింది. మానవ అభివృద్దిలో జరిగే అన్ని కార్యకాలాపాలలో కెల్లా విజ్ఞానం కీలకమైనది.

ప్రజాస్వామ్యపు వేళ్లు సామూహిక విద్యలోనే ఉన్నాయి. ఈ పునాది మరింత పటిష్టంగా మారాలి, రేపటి పౌరులైన పిల్లలు కూడా ఎన్నికల ప్రక్రియ గురించి చదుకోవాలి. ఒక దేశ ప్రతిష్ట అంటే కేవలం ఆర్థిక, సైనిక సామర్థ్యాలే కావు. ఒక దేశం మృదు స్వభావం కూడా భిన్నమైన దృష్టిని కల్పిస్తుంది. అలాంటి మృదు స్వభావ శక్తిలో క్రీడలు ఒకటి. దీని ద్వారా భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. మన జీవితంలో క్రీడలకు ప్రాముఖ్య లేకపోయినట్లయితే, సమాజంలో మనం క్రీడాస్ఫూర్తిని అందించలేం. మన సామాజిక జీవితంలో క్రీడలు అనివార్యం, విడదీయరానివి.

యువత రూపంలో భారతదేశానికి కొత్త శక్తి ఉంది. ప్రజాస్వామ్యపు రూపును మార్చుకునే సామర్థ్యం భారతదేశానికి ఉంది. మనం జీవించడానికి ప్రపంచం ఉత్తమ ప్రదేశంగా ఉండాలంటే, మనం దానిని ఒక యూనిట్‌గా తీసుకోవాలి. ఆర్థిక వృద్ధి వ్యాప్తి చెందాలని కోరుకుంటే అందులో మనం ప్రజలను భాగస్వాములు చేయాలి. అభివృద్ధి విధానం స్థిరంగా కొనసాగాలంటే, వాతారణంతో మనం పనిచేయాలి.

యువత రూపంలో భారతదేశానికి కొత్త శక్తి ఉంది. ప్రజాస్వామ్యపు రూపును మార్చుకునే సామర్థ్యం భారతదేశానికి ఉంది.  సమాజంలో మార్పు తీసుకురావాలని చేసే చిన్న ప్రయత్నాలు కుడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. సమాచారం అనేది చేతికర్రలా ఉపయోగపడి, మార్గం దాటేందుకు తోడ్పడాలి. కానీ మార్గాన్ని చీకట్లో వెతుక్కోవాలని ప్రయత్నిస్తే, కేవలం విజ్ఞానం మాత్రమే మీరు మార్గం చూపిస్తుంది.  చదవటం అనేది అభివృద్ధికి ఇంధనంగా మారుతుంది. రూపం, వ్యక్తీకరణ లేని విజ్ఞానం అనేది అర్థరహితమైంది. దీపపు కాంతి మాదిరిగా, ప్రతిఒక్కరికీ వృద్ధి చెందాలనే సహజ స్వభావం ఉండాలి. ఈ విధానాన్ని అవలంబించుకోవాలి. ప్రతిఒక్కరిలో మంచి, చెడులు ఉంటాయి. మంచిపై దృష్టి సారించాలని నిర్ణయించుకునే వారు జీవితంలో విజయం సాధిస్తారు. కష్టపడి పనిచేస్తే, అలసట ఉండదు, సంతృప్తి మిగులుతుంది. సమాజానికి సేవ చేసే అవకాశాన్ని పొందటం ద్వారా, మనం మన రుణాన్ని చెల్లించుకు అవకాశాన్ని పొందుతాం .

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply