ఇలా అయితే ఎయిడ్స్ కేసులు పెరుగుతాయి…

Share Icons:

చెన్నై, 6 సెప్టెంబర్:

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే సుప్రీం ఇచ్చిన తీర్పుని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తప్పుపట్టారు. అక్కడితో ఆగకుండా దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…స్వలింగ సంపర్కానికి అనుమతి ఇస్తే హెచ్ఐవీ, ఎయిడ్స్ కేసులు మరింత పెరిగిపోతాయని అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కం గురించి ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే చివరిది కాదని, దీన్ని ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కి తీసుకెళ్లవచ్చని తెలిపారు.

సెక్షన్‌ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక దుష్ప్రవర్తనకు దారి తీయడమే కాక పలు లైంగిక వ్యాధుల సంక్రమణకు అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక స్వలింగ సంపర్కం అనేది ఒక జన్యుపరమైన రుగ్మతగా  పేర్కొని.. దీన్ని ఒక ప్రత్యామ్నాయ లైంగిక ప్రవర్తనలా పరిగణించకూడదని తెలిపారు.

మామాట: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మీ తర్వాతే ఎవరైనా……

Leave a Reply