సుజనా సమర్పించు.. బ్యాంకురుణాలు .. సినిమా

movie,sujana,banks,
Share Icons:

గొర్రె కసాయి వాణ్ని నమ్ముతుందని సామెత. అంతే.. నమ్మకం ఉంటేనే మోసం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎవరూ నమ్మని వాడు ఎవరిని మోసగించగలడు చెప్పండి.

[pinpoll id=”65933″]

ఇపుడు మీకు యలమంచిలి సత్యనారాయణ చౌదరి అని చెబితే.. ఎవరో పెద్దాయన, అనుకోవచ్చు.. కానీ సుజనా చౌదరి అంటే చాలా విషయాలు సినిమా రీళ్ల మాదిరి కళ్ల ముందు తిరిగి కళ్లు బైర్లకమ్మవచ్చు. ఎందుకు?  పన్నుకట్టకుండా నల్లధనం మేటలు వేయించడం, దానికి అండగా బాబు లాంటి వాణ్ని కాపాలా ఉంచగలగటం మీకు నాకూ చేతనవుతుందా? అందుకు! పైగా, కింద ఇన్ని నల్ల మచ్చలు పెట్టుకుని స్వచ్ఛమైన (అని వాళ్లు చెబుతున్నట్టు) కమలం పార్టీతో కలిసి కేంద్రంలో మంత్రిగా చక్రం తిప్పనూగలరు.

సామాన్య రైతుకి పంట రుణం ఇవ్వడానికి ముప్పుతిప్పలు పెట్టే బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 9.500 కోట్ల రుణాలు పొందగలరు.  వాటిని దేశం కాని దేశాలలోని తన ఖాతాలకు మళ్లించగలరు. చివరకు తానేమీ తప్పుచేయలేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ దబాయించగలరు. ఇంతకూ బ్యాంకులుంది ఇలాంటి వారికి రుణాలిచ్చి, వాటిని మొండి బకాయిలుగా మాఫీ చేయడానికా… సుజనా నయా సామ్రాజ్యాన్ని ప్రజలెందుకు భరించాలి. పేదల డబ్బుతో ఇలా కొందరు కోటాను కోట్లకు పడగలెత్తే విధానాన్ని నిరోధించాలి, సుజనా చౌదరికి చట్టం పరిధిలో కఠిన శిక్షపడేలా పాలకులు పారదర్శకంగా వ్యవహరించాలనీ కోరుకోవడం అత్యాశ కాదు కద.

మామాట: రుణం మంటూరులో బ్యాంకుల తీరు కూడా మారాలి..  

Leave a Reply