కుక్క గెలిచింది…

Share Icons:

సిడ్నీ, జూలై 31,  ఇటీవల కుక్కలు కూడా వార్తల్లోకి ఎక్కేస్తున్నాయి. ఆ మధ్య ఓ యువకుడు కుక్కను కొరికేసాడంటూ హడావుడు జరిగింది, తరువాత ఢిల్లీ సామూహిక ఆత్మహత్యల కుటుంబానికి చెందిన శునకం కూడా విశ్వాసం వీడక చనిపేయింది.. ఇదో మరో  వీధి శునకరాజం విజయవంతంగా పతాక శీర్షికల్లోకి ఎక్కేసింది..

ఆస్ట్రేలియాలో ఇటీవల నిర్వహించిన ఓ హాప్ మారధాన్ లో స్ట్రామీ అనే వీధి కుక్క మనుషులతో  పోటీ పడి విజేతగా నిలిచింది. బంగారు పతకం అందుకుంది. పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన కల్గూర్లి అనే పట్టణంలో ఇటీవల నిర్వహించిన ఈ 21 కిమీ హాప్ మారధాన్ పోటీలో పాల్గొన్న స్ట్రామీ కేవలం  2.30 గంటల్లో నడక పూర్తిచేసింది.  రేసు ప్రారంభానికి ముందే అక్కడకు చేరుకున్న ఈ శునకం అందరినీ పలకరించిందట, స్నేహపూర్వకంగా తోక ఊపుతూ కలివిడిగా తిరిగిందట. చివరకు రేస్ ప్రారంభం కాగానే మనుషులతో పాటూ ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్లిందని నిర్వాహకుడు గ్రాంట్ హోలీ తెలిపారు.

 

మామాట: శునకమైనా కాక పోతిని మెడల్ గెలవగా…. 

Leave a Reply