బలపడ్డ రూపాయి…లాభాల్లో మార్కెట్లు…

Stock markets
Share Icons:

ముంబై,14 సెప్టెంబర్:

రూపాయి బలపడటం, కొనుగోళ్ల మద్దతుతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల దిశగా పయనించాయి. అలాగే ప్రధాని మోదీ ఆర్థిక సమీక్షను నిర్వహించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కూడా బలపడింది. దీంతో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 373 పాయింట్లు పెరిగి 38,091కి ముగియగా, నిఫ్టీ 145 పాయింట్లు లాభపడి 11,515కు ఎగబాకింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.23 పైసలు కోలుకుని 71.95గా కొనసాగుతోంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బలరాంపూర్ చీనీ మిల్స్ (13.81%), గ్రాన్యూల్స్ ఇండియా (10.17%), రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ (9.15%), యూఫ్లెక్స్ (9.14%), జిందాల్ సా (7.82%).

టాప్ లూజర్స్:
అశోక బిల్డ్ కాన్ (-5.92%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-5.37%), క్వాలిటీ (-4.43%), సియెంట్ లిమిటెడ్ (-3.13%), వెల్స్ పన్ కార్ప్ (-2.94%)

మామాట: మొత్తానికి రూపాయి కోలుకుంటుంది….

Leave a Reply