లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Share Icons:

ముంబై, అక్టోబర్ 10,

మంగళవారం నష్టాలతో  నీరసంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు  బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. కాగా  ఈరోజు సెన్సెక్స్ 461.42 పాయింట్లు లాభపడి 34760.89 వద్ద, నిఫ్టీ 159.05 పాయింట్ల లాభంతో 10,460.10 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. బుధవారం మార్కెట్లో  రూపాయి బలపడడం, బ్యాంకింగ్, ఆటో పరిశ్రమ తదితర రంగాల షేర్లు లాభాలు చవిచూశాయి. ఈ నెల 11న రిజర్వ్ బాంక్ కేంద్ర ప్రభుత్వం జారీచేయనున్న బాండ్లను కొనుగోలు చేయనుంది. ఈ వార్తలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. 

బుధవారం ట్రేడింగులో యాక్సిస్ బ్యాంకు , బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, జీ ఎంటర్ టైన్, ఐషర్ మోటార్స్ తదితర సంస్థల షేర్లు లాభపడగా, భారతి ఇన్ ఫ్రాటెల్, టీసీఎన్, విప్రో, హెచ్ సీఎల్ టెక్ మొదలైన సంస్థల షేర్లు నష్టాలలో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ కాస్త మెరుగుపడి రూ.74.17 గా నమోదైంది.

మామాట: ఫరవాలేదు కాస్త కోలుకుందనమాట

Leave a Reply