నిన్న లాభం….నేడు నష్టం…రేపేంటో మరి?

Share Icons:

ముంబై, మే 23:

గత 10 రోజులుగా న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు ఒక్క మంగళవారం రోజు లాభాల బాట ప‌ట్టినా అంత‌లోనే మళ్ళీ బుధవారానికి యధావిధిగా నష్టాలతో ముగిసాయి.

బుధ‌వారం ప్రపంచ మార్కెట్ల అనుకూల నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా కనిష్టస్థాయికే పరిమితమయ్యాయి. చివరి రెండు గంటలు అమ్మకాలు పుంజుకోవడంతో చివరికి నష్టాలతో ముగిశాయి.

ఒక వైపు సెన్సెక్స్‌ 304 పాయింట్లు తగ్గి 34,347 పాయింట్ల వద్ద నిలవగా.. మరో వైపు నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 10,429 పాయింట్ల వద్ద స్థిరపడింది.

మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టపోగా.. ఆసియా, యూరప్‌ మార్కెట్లు సైతం నష్టాల దిశ‌గా పయ‌నించ‌డంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడినట్లు మార్కెట్ నిపుణులు చెప్పారు.

దీనికితోడు రూపాయి ఏడాదిన్నర కనిష్టం 68.28ను తాకడం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు తెలియజేశారు. పెట్రోలియం ఉత్ప‌త్తుల ధ‌ర‌లు ఎక్కువగా ఉండడం కూడా భార‌త మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణ‌మై ఉండొచ్చ‌ని స్టాక్ బ్రోక‌ర్లు చెబుతున్నారు.

మామాట: పెరిగినట్టే పెరిగి తగ్గిపోయిన స్టాక్ మార్కెట్లు

Leave a Reply