టెస్టుల్లో తోపు ఎవరు? విరాట్ కోహ్లీ వర్సెస్ స్మిత్

Steve Smith best in Tests, Virat Kohli on top across formats
Share Icons:

దుబాయ్:

తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. దాదాపు సంవత్సరం పాటు టెస్ట్ ర్యాంకింగ్స్‌ లో తొలి స్థానంలో ఉన్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ స్థానాన్ని స్టీవ్ స్మిత్ చేజిక్కించుకున్నాడు. 904 పాయింట్లతో అగ్రస్థానంలో స్మిత్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. 903 పాయింట్లతో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. కాగా పాయింట్ల పరంగా వీరిద్దరి మధ్య కేవలం ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది.

అయితే తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్  నాలుగో టెస్ట్ లో స్మిత్ డబుల్ సెంచరీ చేశాడు దీంతో అతని పాయింట్లు ఇంకా మెరుగుపడి ఉంటాయి. అయితే స్మిత్ కోహ్లీల మధ్య పెద్ద తేడా ఏం లేదు. దీంతో అసలు ఇద్దరిలో ఎవరు తోపు బ్యాట్స్ మెన్ అనే చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్నర్ ఇద్దరిలో తోపు ఎవరో తేల్చేశారు.

టెస్టుల్లో స్టీవ్ స్మిత్‌కి కాస్త అడ్వాంటేజ్ ఉంటుందనీ… కానీ తన ఫేవరెట్ మాత్రం కోహ్లీ అని చెప్పాడు. అన్ని ఫార్మాట్లనూ దృష్టిలో పెట్టుకొని తాను ఇలా అంటున్నానని చెప్పాడు. ఇక టెస్ట్ క్రికెట్ ఉన్నంతకాలం… విరాట్ కోహ్లీ, స్మిత్ మధ్య పోరు అలాగే ఉంటుందని షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ క్రికెట్ విషయంలో మాత్రం తాను స్టీవ్ స్మిత్‌ని ఎంపిక చేస్తానని తెలిపాడు. అతని బదులు విరాట్‌ తెరపైకి వచ్చినా… తనకు ఆనందంగానే ఉంటుందన్నాడు… విరాట్‌ను లెజెండ్ అని అభివర్ణించాడు.

అయితే ప్రపంచంలో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ని భావిస్తున్నానని, అన్ని ఫార్మాట్లలోనూ… బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరంటే మాత్రం అది విరాటే అవుతాడని అన్నాడు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వివ్ రిచర్డ్స్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్. ఇప్పుడు మాత్రం వన్డే ఇంటర్నేషనల్‌లో విరాటే బెస్ట్. ఇంకా చెప్పాలంటే… వివ్ రిచర్డ్స్‌ని అతను దాటేశాడని చెప్పుకొచ్చాడు. అన్ని ఫార్మ్స్‌నీ దృష్టిలో పెట్టుకొని విరాట్‌ను వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేయవచ్చన్నాడు. కెప్టెన్‌గా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా… బ్యాట్స్‌మన్‌గా మాత్రం… విరాట్ కోహ్లీ ఎన్నో అద్భుతాలు సాధించాడని ప్రశంసించాడు. కానీ టెస్టుల్లో మాత్రం స్టీవ్ స్మిత్ కొంచెం ఎడ్జ్ లో ఉన్నాడని ప్రస్తుతానికైతే టెస్టులో స్మిత్ నెంబర్ 1 అన్నాడు.

Leave a Reply