ఏపీ పరిషత్ ఎన్నికల హై కోర్ట్ సింగల్ జడ్జి స్టే పై డివిజన్ బెంచ్ కి అప్పీల్

Share Icons:
-ఎన్నికలు జరగవలసిన తరుణంలో… రాష్ట్ర ప్రభుత్వానికి పిడుగుపాటు
-ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలకు చెంపపెట్టు:- విపక్షాలు

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 8 న నిర్వవించనున్న జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. కేవలం రెంరోజుల్లో ఎన్నికలు జరగనుండగా హైకోర్ట్ నిర్ణయం రాష్ట్ర సర్కార్కు పిడుగులాంటి వార్తే . ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానివి తొందరపాటు నిర్ణయాలేనని అందువల్ల ఇది ముమ్మాటికీ చెంపపెట్టె అని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. గత సంవత్సరకాలం పైగా ఎన్నికలపై రాష్ట్ర సర్కార్ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం తో విభేదించింది. గత ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై యుద్ధం తోనే సరిపోయింది.

ఇప్పడు తిరిగి కోర్ట్ తీర్పు కచ్చితంగా ఇబ్బందికరంగా మారె పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పరిషత్ ఎన్నికలను బాయ్కాట్ చేసింది. హైకోర్టు తెలుగుదేశం వేసిన పిటిషన్ మీదనే ఎన్నికలపై సింగిల్ జడ్జి కోర్ట్ స్టే విధించింది. దీనితో ఎన్నికలు జరగటం సందిగ్ధంగా మారింది.ఇప్పడు ఏమిచేయాలనే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం తల పట్టుకుంది . సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ముందు 4 వరాల సమయం ఉండటంతో పాటు ఎన్నికల కోడ్ అమలు జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది. విపక్షాలు ఎన్నికల ప్రక్రియను మొత్తం రద్దుచేయాలని కోరాయి . నోటిఫికేషన్ పోలింగ్ కు ముందు 4 వారాలు కచ్చితంగా ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికలలో పాల్గొనే విషయంలో పునరాలోచించాలని సిపిఐ కార్యదర్శి నారాయణ విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్ట్ ఆదేశాలు దిక్కరించినట్లే నని అందువల్ల ఎన్నికల సంఘం తిరిగి అన్నిరాజకీయ పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని వత్తిడి పెరుగుతుంది.

 హై కోర్ట్ సింగల్ జడ్జి స్టే పై డివిజన్ బెంచ్ కి అప్పీల్
-కోర్ట్ తీర్పు కోసం ఎదురు చూపులు

ఏపీ హైకోర్టు పరిషత్ ఎన్నికలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసింది.. కోర్ట్ తీర్పు కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రంగంలో ఉన్న అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటించలేదని కనీసం పోలింగ్ కు 4 వారాల ముందు ఎన్నికల ముంచు నుంచి కోడ్ అమలు చేయాలనీ సుప్రీం కోర్ట్ ఇచ్చిన పాటించలేదని తెలుగుదేశం తరుపున లాయర్లు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన సింగిల్ బెంచ్ ఎన్నికలను నిలిపి వేస్తూ సంచలన నిర్నయం తీసికుంది. ఈ నెల 15 లోపు ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయాలనీ అప్పటివరకు కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఇది రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెంపపెట్టు లాంటిదే . డివిజన్ బెంచ్ కు ఎన్నికల సంఘం వెళ్లటంతో ఈ కేసును అత్యవసరంగా భావించిన కోర్ట్ ఈ రాత్రి కి విచారణ జరిపే ఆవకాశం ఉన్నట్లు సమాచారం . పరిషత్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన స్టే ను స్వాగతిస్తున్నామని తెలుగుదేశం ప్రకటించింది. సిపిఐ నారాయణ కూడా దీన్ని స్వాగతించారు. అయితే ఆయన చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తిరిగి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

– కె రాంనారాయణ, జర్నలిస్ట్.

Leave a Reply