స్టాలిన్‌కే అధ్యక్ష పీఠం…!

Stalin is the next president of the DMK Party
Share Icons:

చెన్నై, 11 ఆగష్టు:

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణం తర్వాత ఖాళీ అయిన ఆపార్టీ అధ్యక్ష పీఠం స్టాలిన్‌కి దక్కనుందా..అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. కరుణానిధి తర్వాత ఆయన కుమారుడు స్టాలిన్ అధ్యక్షుడు అయితేనే పార్టీని సమర్ధవంతంగా నడిపించగలరని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న స్టాలిన్‌ని పార్టీ శ్రేణులు ఈ నెల 14న అధ్యక్ష పీఠం ఎక్కించే పనిలో ఉన్నాయి.

అయితే పార్టీలో సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి అన్బళగన్ వయసు 96 ఏళ్లు కావడంతో, తప్పని స్థితిలో కరుణానిధి కుటుంబానికే అధ్యక్ష బాధ్యతలను అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు, తన రాజకీయవారసుడు స్టాలినే అంటూ గతంలోనే కరుణ పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పారు.

అలాగే గత ఎన్నికల సమయంలో స్టాలిన్ రాష్ట్రమంతా తిరిగి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా 89 స్థానాలను సాధించిపెట్టారు. ఈ నేపథ్యంలో, పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్టాలిన్‌ చేపట్టబోతున్నారు. ఇక దీనికి ఇతర కుటుంబ సభ్యులు కూడా సుముఖంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

మామాట: మరి కరుణానిధి స్థానాన్ని స్టాలిన్ భర్తీ చేయగలరా..?

Leave a Reply