శ్రీశైలం సీటుపై వీడని ఉత్కంఠత…

Share Icons:

కర్నూలు, 19 మార్చి:

అనూహ్య పరిణామాల మధ్య శ్రీశైలం నుండు బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో రాజకీయం కీలక మలుపులు తిరుగుతుంది. ఈ స్థానం నుంచి ఏవీ సుబ్బారెడ్డిని పోటీ చేయించాలని టీడీపీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రంగంలోకి దిగిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి… తనకు శ్రీశైలం టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ గెలుపుతో పాటు కర్నూలు లోక్ సభ నియోజకవర్గంలోనూ పార్టీని కలిసొస్తుందని టీడీపీ అధినాయకత్వానికి సూచించినట్టు తెలుస్తోంది.

తనకు శ్రీశైలం టికెట్ ఇస్తే… నందికొట్కూరులోనూ పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే చంద్రబాబు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా లేక ఏవీ సుబ్బారెడ్డికే ఛాన్స్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే ఒకప్పుడు టీడీపీలో మంత్రిగా పని చేసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి… ఆ తరువాత రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన బైరెడ్డి… తాజాగా టీడీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది.

మామాట: సీటు కావాలని ఎవరికి ఆశ ఉండదులే

Leave a Reply