శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ అందాలు

Share Icons:

శ్రీనగర్,  ఏప్రిల్ 15,

కాశ్మీరం అంటే దేవతల లోకం. నిజమే హిమపర్వత సానువుల్లో పచ్చిక బయల్లు, పూలవనాలూ, స్వచ్ఛమైన నీటితో నిండిన సరస్సులూ చూస్తే అలాగే అనిపిస్తుంది.. ఇక శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ అందాలు ఇక్కడి దాల్ సరస్సు అందాలను మరుగుపరుస్తున్నాయి. ఈ తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్దది. కశ్మీర్ లోయలో పర్యటక సీజన్ ప్రారంభానికి గుర్తుగా ఈ గార్డెన్‌లోకి పర్యటకులను అనుమతిస్తున్నారు.  దీంతో ఒక్కసారిగా స్థానికులు, పర్యటకులతో గార్డెన్ కిటకిటలాడింది. దీంతో ఇక్కడ పర్యటకరంగంపై ఆధారపడి జీవించేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తులిప్‌లలో వివిధ రకాలకు చెందిన 12 లక్షల తులిప్‌ మొక్కలను ఈ సంవత్సరం గార్డెన్‌లో నాటారు. ఒక్కో తులిప్‌ పుష్పం గరిష్టంగా మూడు, నాలుగు వారాలుంటుంది. ఈ తోట జాబర్వాన్ పర్వతప్రాంతంలోని 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఆవరించి ఉంది.  ఈ గార్డెన్ కారణంగా కశ్మీర్ లోయలోని పర్యటకరంగానికి రెండు నెలల ముందే కళ వచ్చింది. ఒక్క వారం రోజుల్లోనే 70 వేలమంది ఈ తులిప్‌ గార్డెన్‌ను దర్శించారు. బాదామ్‌వారి ప్రాంతంలోని బాదం చెట్లు ప్రపంచవ్యాప్త పర్యటకులకు ఓ అందమైన అనుభూతినిస్తాయి.

కోహెమరన్ పర్వత సానువుల్లో ఉన్న ఈ గార్డెన్ సంవత్సరం పొడవునా తెరిచే ఉన్నప్పటికీ మార్చిలో మాత్రం ఇక్కడి బాదం చెట్ల అందాలను చూడటానికి పెద్దసంఖ్యలో పర్యటకులు వస్తారు. ఆవాల చెట్లకు పూసిన పువ్వులు లోయ మొత్తాన్ని పసుపురంగులోకి మార్చేసి కశ్మీర్‌ అందాలను మరింత పెంచాయి.

మామాట: కనులు చాలవూ, మాటలేలేవూ..

Leave a Reply