కలిసిన శ్రీముఖి-రాహుల్: కొత్త రిలేషన్ షిప్ మొదలైంది…

srimukhi and rahul sipligunj comes-back-and-celebrates-their-relationship
Share Icons:

హైదరాబాద్: బిగ్ బాస్ సీజన్-3లో శ్రీముఖి-రాహుల్ లు ఉప్పు,నిప్పులు మాదిరిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఇద్దరిలోనే ఒకరు విన్నర్ గా నిలుస్తారని అంతా అనుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే రాహుల్ విన్నర్ అయితే, శ్రీముఖి రన్ రప్ గా నిలిచింది. షో అయిపోయిన దగ్గర నుంచి అందరూ కలుస్తున్న వీరిద్దరు మాత్రం కలవడం లేదు. ఈక్రమంలోనే శ్రీముఖికు కాల్ చేసిన మాట్లాడటం లేదని రాహుల్ ఆరోపించాడు. అయితే ఉన్నట్టు ఉండి వీరు కలిశారు.

ఈ ఇద్దరూ ఓ పార్టీలో సందడి చేశారు. దానికి సంబందించిన ఓ వీడియోను వితిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే వీడియోను శ్రీముఖి తన సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసింది. ఆ వీడియోలో శ్రీముఖి, రాహుల్, వరుణ్, వితికలు ఫుల్‌గా ఊగుతూ డ్యాన్స్ చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ హౌజ్‌లో ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు సద్దుమణిగి.. పూర్వ స్థితికి వచ్చారని సంతోషిస్తున్నారు వారి అభిమానులు. ఇదే విషయాన్ని శ్రీముఖి కూడా ప్రస్తావిస్తూ.. గతం గతహ.. ఇక ఇప్పడే అసలైన రిలేషన్ షిప్ మొదలైందని.. పేర్కోంది.

పటాస్ నుంచి రవి ఔట్…

జ‌బ‌ర్ద‌స్త్ లాంటి కామెడీ షోల త‌ర్వాత ప‌టాస్ కూడా మ‌రో మంచి స్టాండ‌ప్ కామెడీగా గుర్తింపు తెచ్చుకుంది. ర‌వి, శ్రీ‌ముఖి కెమిస్ట్రీ కూడా ఈ షోకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 1100 ఎపిసోడ్ల‌కు పైగా క‌లిసి చేసారు ఈ ఇద్ద‌రూ. ఈటీవీ ప్ల‌స్ టాప్ షోగా రేటింగ్ అందుకుంటూ వ‌చ్చింది ప‌టాస్. కుర్రాళ్ళే టార్గెట్‌గా వచ్చిన ఈ షోకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే ఈ షో నుంచి శ్రీముఖి ఎప్పుడో తప్పుకోవడంతో వర్షిణితో రవి యాంకరింగ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ షో నుంచి రవి కూడా బయటికి వచ్చేసాడు. ఇకపై యాంకర్ రవి స్థానంలో చలాకీ చంటి హోస్టుగా రానున్నాడు. తాజాగా ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. జీ తెలుగులో ఉన్న లోకల్ గ్యాంగ్స్ షోకు వెళ్లాడు రవి. దాంతో 2000 పైగా ఎపిసోడ్స్ చేసిన రవి పటాస్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. శ్రీముఖి తప్పుకోవడంతో ప‌టాస్ షోపై ప్ర‌భావం పడింది. దాంతో ఆ ఒత్తిడి రవిపై కూడా పడింది. శ్రీముఖి తర్వాత వర్షిణి వచ్చినా కూడా రవితో ఆమె పెద్దగా కెమిస్ట్రీ పండించలేకపోయింది. మరి పటాస్ ని చంటి ఎలా నడిపిస్తాడో చూడాలి.

 

Leave a Reply