రజనీపై సెటైర్ వేసిన మాజీ క్రికెటర్….

Rajanikanth request to the cm kumarasw
Share Icons:

శ్రీలంక, 11 జనవరి:

శ్రీలంక మాజీ క్రికెటర్ మురళీధరన్ రాజకీయాల్లోకి రాబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దేశంలో మాజీ క్రికెటర్లు రణతుంగ, జయసూర్య వంటి వాళ్లు రాజకీయాల్లో ఉన్నారు. ఇక వారి బాటలోనే మురళీధరన్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వార్తలు వినిపించాయి.

అయితే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన మురళీధరన్… తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై సెటైర్ వేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మురళి మీడియాతో మాట్లాడుతూ.. తనకు రాజకీయాల్లోకి వచ్చే విషయంలో రజనీకాంత్ తరహాలో ఎలాంటి తికమక పడటం లేదని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాల్లోకి వచ్చేందుకే తాను సేవా కార్యక్రమాలు చేయడం లేదని, తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని… తన సేవా కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని మురళీధరన్ అన్నారు.

మామాట: మరి దీనిపై రజనీ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో…

Leave a Reply