Sri Reddy: పూనమ్ కౌర్ మళ్లీ ప్రెగ్నెంట్.. పవన్-పూనమ్‌ రహస్య బంధంపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్

Share Icons:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-పూనమ్ కౌర్ రహస్య బంధంపై గత కొంతకాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్న వివాదాస్పద నటి మరోమారు ఈ ఇద్దర్నీ టార్గెట్ చేసి రెచ్చిపోయింది. ఈసారి ఇంకాస్త ఘాటు పెంచుతూ సంచలన పోస్ట్‌ను తన ఫేస్ బుక్‌లో షేర్ చేసింది. ‘ఈ బ్రెయిన్ లేని పూనమ్ అక్క ఒకటి.. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు పీకే ****** పట్టుకుని ఉయ్యాల ఊగుతాంది. మళ్లీ ప్రెగ్నెంట్ ఏమో’ అంటూ రాయడానికి వీలులేని బూతులతో చెలిరేగింది శ్రీరెడ్డి.

అయితే ఈసారి పూనమ్‌ని టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఏంటంటే.. రీసెంట్‌గా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సినిమాను ప్రకటిస్తూ.. పవన్ డూప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. డిజిటల్ టెక్నాలజీకి, ఆన్‌లైన్ వేదికలను క్యాష్ చేసుకుంటూ RGVWorld.in/ShreyasET ద్వారా వరుస సినిమాలు విడుదల చేస్తున్న వర్మ తాజాగా క్రితం పవన్ కళ్యాణ్ లైఫ్ ఆధారంగా ‘పవర్ స్టార్’ సినిమా తీస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రలో నటించేందుకు ఆయన పోలికలతో ఉన్న నరేష్ అనే టిక్ టాక్ స్టార్‌ని పట్టుకున్నారు వర్మ. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

అయితే వర్మ పవర్ స్టార్ సినిమా ప్రకటించగానే సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ పోస్ట్‌లు పెట్టారు . ‘అమ్మాయిల మానసిక బలహీనతను పసిగట్టడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించమని వారిని ప్రేరేపించడం, తన ట్వీట్స్‌ను పంపి షేర్ చేయమని చెప్పడం, దీని గురించి మీడియాకు తెలియజేయడం వంటి పనులు చేసే ఆర్జీవీ అనే క్యారెక్టర్‌ను కూడా దయచేసి ఈ సినిమాలో పెట్టండి. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు మీరంటే నాకు ఎంతో గౌరవం. కానీ, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది పూనమ్.

‘ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక గంటపాటు నాకు బ్రెయిన్‌వాష్ చేసిన ఈ విశ్వాసఘాతుకుడైన డైరెక్టర్ ఫోన్ కాల్‌ను రికార్డు చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అతను నాకు పంపిన ట్వీట్స్‌ను సంబంధిత వ్యక్తికి నేను అప్పుడే పంపాను. నా అదృష్టం కొద్దీ మీడియాలో కొంత మంది నిజాయతీపరులు ఉన్నారు. లేకపోతే నీ కుట్రలకు నేను బలైపోయేదాన్ని’ అని వర్మను ఉద్దేశించి పూనమ్ సంచలన ఆరోపణలు చేయడంతో.. పవన్‌పై వర్మ సినిమా తీస్తాననడం ఏంటి?? దానిపై పూనమ్ సీరియస్ అవ్వడం ఏంటి?? అంటూ సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ నడిచింది.

అయితే పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఏ ఇష్యూపైనైనా బూతులతో రెచ్చిపోయే శ్రీరెడ్డి.. తాజాగా పూనమ్ ప్రెగ్నెంట్ ఏమో అంటూ ఆమెపై సంచలన పోస్ట్ షేర్ చేసింది. అయితే గతంలో పూనమ్ కౌర్.. పీకే లవ్స్ పేరుతో ఉన్న మాస్క్‌ని ధరించి ట్విట్టర్‌లో ప్రచారం నిర్వహించింది పూనమ్. దీనిపై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ‘పూనమ్ అక్క.. పీకే మాస్క్ వేసుకోవటం ఎందుకు?? మా అందరికీ పీకేకి ఉన్న మాస్క్ తీసేయ్ అంటే తీయవు. మాస్క్ కే పీచే క్యా హై??’ అంటూ కామెంట్స్ చేసింది. దీంతో రియాక్ట్ అయిన పూనమ్.. స్వేచ్ఛ పేరుతో అమ్మానాన్నలను వదిలేసి, డబ్బు కోసం క్యారెక్టర్‌ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మరో మృగం’’ అంటూ తీవ్ర స్థాయిలో మండి పడుతూ శ్రీరెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చింది పూనమ్. దీనికి మళ్లీ శ్రీరెడ్డి ఇంకాస్త ఘాటుగా స్పందిస్తూ ‘పూనమ్‌ని ప్రాస్టిట్యూట్’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యి నోటికి పనిచెప్పింది. అయితే చాలా రోజుల తరువాత వీరి మధ్య వివాదం మళ్లీ చెలరేగింది.