ప్రతీకారం తీర్చుకున్న లంకేయులు….

Share Icons:

టీ-20 ట్రై సిరీస్‌లో భారత్‌పై శ్రీలంక ఘనవిజయం

కొలంబో, 7 మార్చి:

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు టోర్నీ తొలి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఇటీవలి కాలంలో తమను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంది.

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మంగళవారం రాత్రి భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ తొలి ఓవర్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాతి ఓవర్‌లోనే ప్రదీప్‌ ఫుల్‌టా్‌సకు సురేశ్‌ రైనా (1) బౌల్డ్‌ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు.

dhawan 90 runs scores in srilanka

తర్వాత మనీష్ పాండే 37, రిషబ్ పంత్ 23, దినేశ్ కార్తీక్ 13 సహకారంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

లంక బౌలర్లలో దుష్మంత చమీర 2వికెట్లు పడగొట్టగా, నువాన్ ప్రదీప్, జీవన్ మెండిస్, దనుష్క గుణతిలక  చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

కుశాల్ పెరీరా 37 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేసి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు దనుష్క గుణతిలక 19, కుశాల్ పెరీరా 11, దినేశ్ చండీమల్ 14, ఉపుల్ తరంగ 17, దాసన్ శంక 15, థిసార పెరీరా 22 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ చెరో 2వికెట్లు తీసుకోగా, జయ్‌దేవ్ ఉనద్కత్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఇంకా లంక విజయంలో కీలక పాత్ర పోషించిన కుశాల్ పెరీరాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. ట్రై సిరీస్‌లో భాగంగా గురువారం భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.

మామాట: ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకున్నారు...

English summary:

Sri Lanka batsmen Kusal Perera’s blazing half-century trumped Shikhar Dhawan’s 49-ball 90 as Sri Lanka defeated India in the opening T20I of the Nidahas Trophy tri-series by five wickets at R Premadasa Stadium in Colombo on Tuesday. Riding on Perera’s 37-ball 66, the hosts chased down 175 in 18.3 overs.

One Comment on “ప్రతీకారం తీర్చుకున్న లంకేయులు….”

Leave a Reply