మాల్దీవ్స్ లో రచ్చ చేస్తున్న శ్రీముఖి….

sreemukhi enjoying holiday in maldievs after big boss
Share Icons:

హైదరాబాద్: బిగ్ బాస్ సీజన్ -3లో విన్నర్ తానే అనే లెవెల్లో ప్రచారం జరిగిన ఊహించని విధంగా శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో ముగిసిన వెంటనే మాల్దీవ్స్ కు చెక్కేసి తెగ ఎంజాయ్ చేస్తుంది. దాదాపు మూడు నెలలకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో తన అల్లరితో, టాస్క్‌లతో అదరగొట్టిన శ్రీముఖి రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్లింది. ప్రస్తుతం శ్రీముఖి మాల్ధీవ్స్ బీచుల్లో సందడి చేస్తోంది. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అక్కడికి వెళ్లిన ఈ అందాల యాంకర్ కమ్ యాక్టర్ దానికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను, ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే ఈ ఫోటోస్ పై ఆసక్తికరమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. . తాను బిగ్‌బాస్ విజేతగా నిలవలేకపోయినందుకు బాధ పడుతున్నా.. పైకి మాత్రం నవ్వుతో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ఏమైనా బిగ్‌బాస్ 3 విజేత టైటిల్ గెలలేదన్నా బాధను మొఖంలో  కనపడకుండా.. శ్రీముఖి ఈ రకంగా ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మమ్ముట్టి మామాంగం ట్రైలర్…

యాత్ర సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తాజాగా నటించిన చిత్రం ‘మామాంగం’ మలయాళంలో రూపొందిన ఈ సినిమా, అదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను ఈ నెల 21వ తేదీన పలకరించనుంది. ఉన్నిముకుందన్ .. ప్రాచీ తెహ్లాన్ .. అను సితార ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను వదిలారు. ఆసక్తికరమైన సన్నివేశాలపై  కట్ చేసిన ట్రైలర్ అంచనాలు పెంచుతోంది. చారిత్రక నేపథ్యంలో .. 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, మమ్ముట్టి కెరియర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Leave a Reply