కరోనా వైరస్‌నా.. కమ్మ వైరస్‌నా? ఎన్నికల కమిషనర్‌పై స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

ap speaker tammineni sitaram comments on ntr
Share Icons:

అమరావతి: ఏపీ ఎన్నికల సంఘం కమీషనర్‌ రమేష్‌ కుమార్‌పై స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ ఈసీనే అన్ని నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం ఇక దేనికుంది..? రమేష్ కుమార్‌ను సీఎం కుర్చీలో కూర్చోమనండి..?. ఏం తమాషా చేస్తున్నారా?. రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు కుల,మతాలకు అతీతంగా ఉండాలి’ అని స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగని ఆయన.. వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములొచ్చినా ప్రమాదమేనని స్పీకర్ దారుణ వ్యాఖ్యలు చేశారు.

అలాగే ‘రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా నోటిఫికేషన్ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎస్ఈసీ పెత్తనమేంటి..?. రాష్ట్రానికి కరోనా వైరస్ నా.. కమ్మ వైరస్‌ నా?. రమేష్ కుమార్ ఏది చేస్తే అది చెల్లుతుంది అనుకుంటున్నారా?. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలి. 2019లో ఎన్నికల కమిషన్ సీఎస్‌ను మార్చితే చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. కలెక్టర్లను మార్చమని చెప్పే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారు?. రమేష్ కుమార్ వంటి వ్యక్తులు కీలక స్థానాల్లో ఉంటే రాజ్యాంగానికి అవమానం. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారు’ అని స్పీకర్ విమర్శలు గుప్పించారు.

ఇక ‘ న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్‌లోనూ బ్లాక్ షీప్స్ ఉన్నాయి. రమేష్ కుమార్ రాష్ట్రం వాళ్ళ అబ్బ జాగీరు అనుకుంటున్నాడా?. రాష్ట్రానికి రావాల్సిన 14 ఆర్ధిక సంఘం నిధులు ఎవరిస్తారు. ఈసీ పనికిమాలిన డైరక్షన్‌తో రాజ్యాంగ వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు వంటి చీడ పురుగులు ఉండకూడదు. ఈ వ్యవహారంపై ప్రధాని, రాష్ట్రపతి స్పందించాలి. చంద్రబాబువి నీచ రాజకీయాలు. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారు’ అని తమ్మినేని మాట్లాడారు.

 

Leave a Reply