సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన సఫారీలు…..ఆశలు నిలుపుకున్న పాక్..

Share Icons:

 

లండన్, 24 జూన్:

భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత కసితో ఆడి….. పాకిస్తాన్ ప్రపంచకప్‌లో రెండో విజయం నమోదు చేసుకుంది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో హరీస్ సోహైల్ (59 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (69; 7 ఫోర్లు) అర్ధశతకాలకు.. బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్ (3/50), మొహమ్మద్ ఆమిర్ (2/49) మెరుపులు తోడవడంతో దక్షిణాఫ్రికాపై 49 పరుగుల తేడాతో గెలుపొందింది.

సఫారీ బౌలర్లలో ఎంగ్డీ 3, తాహిర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (63; 5 ఫోర్లు), డికాక్ (47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో ఆకట్టుకున్న సోహైల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట ఓడిన దక్షిణాఫ్రికా అధికారికంగా సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించగా.. అనూహ్యంగా చెలరేగిన పాకిస్థాన్ ఈ విక్టరీతో సెమీస్ అవకాశాలను కాస్త మెరుగుపరుచుకుంది.

ఇక అంచనాలకు మించి అద్భుతంగా రాణిస్తున్న బంగ్లాదేశ్.. టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆప్ఘనిస్థాన్‌తో రోస్‌బౌల్ స్టేడియం వేదికగా సోమవారం అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీలో ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లపై గెలిచిన బంగ్లాదేశ్.. ఈ పోరులో ఎలాగైనా ఆధిపత్యం ప్రదర్శించి సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలనే పట్టుదలగా ఉంది.

 

Leave a Reply