భారత్ గెలవాలంటే ఏం చెయ్యాలో తెలుసా:క్లూసెనర్

Share Icons:

కేప్‌టౌన్, 11 జనవరి:

దక్షిణాఫ్రికా పర్యటనలో మిగిలిన టెస్టుల్లో భారత్ విజయం సాధించాలంటే కోహ్లీ మెరుగ్గా ఆడాల్సిందేనని అంటున్నాడు జింబాబ్వే బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్.

శనివారం ఇరు జట్ల మధ్య సెంచూరియన్‌లో రెండో టెస్టు జరగనుంది.

ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ భారత్ జట్టుకి పలు సూచనలు చేశారు.

తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాలంటే కెప్టెన్ కోహ్లీ పరుగులు చేయాల్సిందేనని చెప్పాడు.

మొదటి టెస్టులో అతను కేవలం 33 పరుగులు చేశాడని, తనతో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్ కూడా ఘోరంగా విఫలమయ్యారని తెలిపాడు.

టీంలో బాగా ఆడే ఆటగాడే పరుగులు చేయలేకపోతే, ఇక మిగిలిన ఆటగాళ్ల మైండులో మేము ఏం చేస్తాం అనే ఆలోచన వస్తుందని అన్నారు.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కోహ్లీ జాగ్రతగా ఆడాలని సూచించాడు.

అదేవిధంగా మొన్నటి టెస్టులో 6వికెట్లు తీసిన పేస్ బౌలర్ ఫిలాండర్‌ని ఎలా ఎదుర్కోవాలో కూడా సలహాలు ఇచ్చారు.

lance klusener some suggestions to india team

ఎక్కువ వేగంతో బంతులు సందిస్తున్న అలాంటి పేసర్లను ఎదుర్కోవాలంటే క్రీజు నుండి 1మీ. దూరం బయటకొచ్చి బ్యాటింగ్ చేయాలని తెలిపాడు. ఒకవేళ మీటరు దూరం కుదరకపోతే కనీసం అర మీటరైన ముందుకొచ్చి ఆడాలని, అలాకాకుండా క్రీజులో నుండే ఆడితే చిక్కులో పడతారని క్లూసెనర్ చెప్పాడు.  తొలి టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత్ బౌలర్లను మెచ్చుకున్నాడు. అంతకముందుతో పోలిస్తే ఇప్పుడు భారత్ పేసర్లు ఫుల్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెడుతున్నారని ప్రశంసించాడు.

అలాగే ఆల్‌రౌండర్ పాండ్య కూడా దక్షిణాఫ్రికా బౌలర్లని సమర్ధంగా ఎదుర్కొని క్రీజులో నిలిచాడని అభినందించాడు. ఇంకా తన బౌలింగ్ కూడా మెరుగు పరుచుకుంటే అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా తయారు అవుతాడని పేర్కొన్నారు.

మామాట: క్లూసెనర్ సలహాలు భారత్ జట్టు పాటిస్తుందా..

English summary: South Africa’s former all-rounder, Zimbabwe batting coach Lance Klusener said that India’s captain Virat Kohli play a better cricket for win the Test series against South Africa.

Leave a Reply