గెలిచారు…పరువు నిలుపుకొన్నారు….

Share Icons:

రెండో టీ-20 లో దక్షిణాఫ్రికా ఘన విజయం….

సెంచూరియన్, 22 ఫిబ్రవరి:

తప్పనిసరిగా గెలిచి పరువు నిలుపుకోవాల్సిన సమయంలో దక్షిణాఫ్రికా జట్టు తనదైన స్థాయిలో పుంజుకుని రెండో టీ-20 మ్యాచ్‌లో ఘన విజయం సాధించి సిరీస్‌ని 1-1 తో సమం చేసింది.

మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20లో భారత్ పై 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత్ జట్టు సరిగా ఫామ్‌లో లేని రోహిత్‌ శర్మ ఖాతా అయినా తెరవకుండానే పెవిలియన్‌కి చేరాడు.

ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన సురేష్ రైనా, శిఖర్ ధావన్‌తో జతకట్టి స్కోరు బోర్డుని పరుగులేత్తించారు.

అయితే వెంట వెంటనే ధావన్‌ (24; 14 బంతుల్లో 3×4, 2×6), విరాట్ కోహ్లి వరుస ఓవర్లలో ఔట్‌ కావడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

ఆ తర్వాత రైనా కూడా (31; 24 బంతుల్లో 5×4) ఫెలుక్వాయో బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఇక మనీష్ పాండే(79 నాటౌట్‌; 48 బంతుల్లో 6×4, 3×6), మహేందర్ సింగ్ ధోని(52 నాటౌట్‌; 28 బంతుల్లో 4×4, 3×6) ఇద్దరు చెలరేగి ఆడి ఐదో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 188/4 పరుగులు చేసింది.

dhoni 52 runs scored in second t20

అనంతరం 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు ఓపెనర్‌ హెన్‌డ్రిక్స్‌ (26) మెరుపులతో భారీ ఛేదనను ధాటిగానే ఆరంభించింది. తొలి రెండు ఓవర్లలో నాలుగు పరుగులే వచ్చినా, మూడు, నాలుగు ఓవర్లలో రెండేసి బౌండ్రీలతో హెన్‌డ్రిక్స్‌ జోరు చూపాడు. అయితే, మరో ఎండ్‌లో పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డ స్మట్స్‌ (2)ను ఉనాద్కట్‌, తర్వాతి ఓవర్లో హెన్‌డ్రిక్స్‌ను శార్దూల్‌ అవుట్‌ చేయడంతో ఆతిథ్య జట్టు కొంత వెనుకంజ వేసింది.

ఆ తర్వాత హిన్రిచ్‌ క్లాసన్‌ (69; 30 బంతుల్లో 3×4, 7×6) చెలరేగడంతో, దానికి జేపీ డుమిని (64 నాటౌట్‌; 40 బంతుల్లో 4×4, 3×6) తొడవ్వడంతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరిదైన మూడో టీ20 శనివారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది. తమ జట్టుకి విజయాన్ని అందించిన క్లాసన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ వరించింది.

మామాట: అలసత్వం వహించారు…ఓడిపోయారు….

English summary:

A blistering 30-ball 69 from Heinrich Klaasen and a measured 40-ball 64* from captain JP Duminy helped South Africa hunt down 189 as they beat India by six wickets in Centurion to draw level at 1-1 in the three-match series on Wednesday.

Leave a Reply