త్వరలో తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర…

Share Icons:

హైదరాబాద్, 15 ఫిబ్రవరి:

త్వరలోనే కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్రను చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పెండింగ్‌లో ఉన్న అభివృద్ది పనులు జరగడమే లక్ష్యంగా ఆయన పాదయాత్ర కొనసాగనున్నట్లు తెలుస్తుంది.

అలాగే దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ సాధన, నారాయణ పేట్ – కొడంగల్ ఎత్తిపోతలకు నిధుల కేటాయింపు కూడా ఆయన డిమాండ్లలో ఉన్నాయి.

అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగా పాదయాత్రను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం.

కొడంగల్ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర, 120 కిలోమీటర్లు సాగి హైదరాబాద్‌లో ముగుస్తుందని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

అయితే బొంరాస్‌పేట్, పరిగి, నస్కల్‌, వికారాబాద్‌, మన్నెగూడ, చిట్టెంపల్లి చౌరస్తా, చేవెళ్ల, మొయినాబాద్‌ మీదుగా యాత్ర సాగుతుందని తెలుస్తోంది.

మామాట: ఆయన లక్ష్యాలు నెరవేరేనా…

English summary:

Congress leader, Kodangal MLA Revant Reddy is scheduled to take a walk in the Telangana state soon.

Leave a Reply