తెలంగాణాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఇండస్ట్రీ….

soon electric vehicles industry establish in telangana state
Share Icons:

హైదరాబాద్, 10 మే:

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఇండస్ట్రీని నెలకొల్పనున్నారు. ఈ మేరకు చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ బీవైడీ ఆటో ఇండస్ట్రీ లిమిటెడ్‌ ప్రతినిధులు బుధవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌‌తో భేటీ ఆయ్యారు. అనంతరం ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ… ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఇండస్ట్రీని స్థానిక కంపెనీలతో కలసి హైదరాబాద్‌లో నెలకొల్పనున్నామని అన్నారు. అలాగే చైనా లాంటి బయట పరిశ్రమను నెలకొల్పడం ఇదే మొదటి సారని వారు తెలిపారు. బస్సులతో పాటు కార్లు, ఆటోలు, ట్రక్కులు కూడా తయారు చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.

ఇక సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని క్రమంగా పెంచుతామని, మొదటి దశలో 500 వాహనాలు కొనుగోలు చేస్తామన్నారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని.. ఆర్టీసీతో పాటు జి‌హెచ్‌ఎం‌సి లోనూ వీటి వినియోగం పెంచుతామన్నారు.

electric vehicle

ఇక ఇక్కడ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నగరాలు, పట్టణాల్లో వాహనాల నుంచి వెలువడే కాలుష్యం పెరిగిపోతోందని, దీన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం తప్పనిసరన్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బస్సు కాలుష్య రహిత వాతావరణానికి ఎంతో అనువుగా ఉంటుందని చెప్పారు. ఇక ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ఒక్కసారి చార్జ్‌ చేస్తే 300–400 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. 3 గంటల్లోనే ఇది ఫుల్‌ చార్జ్‌ అవుతుంది.

మామాట: వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ఇవి బాగానే ఉపయోగపడతాయి…

Leave a Reply